కమెడియన్‌గా టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి స్టార్ ప్రొడ్యూసర్‌గా ఎదిగిన నటుడు బండ్ల గణేష్. పవన్‌ కళ్యాణ్, రామ్‌ చరణ్, ఎన్టీఆర్‌ లాంటి టాప్‌స్టార్స్‌తో సినిమాలను నిర్మించిన గణేష్‌, కొంత కాలంగా ప్రొడక్షన్‌కు దూరంగా ఉన్నాడు. నిర్మాణ రంగంలో నష్టాలు రావటంతో పాటు ఫ్యామిలీ బిజినెస్‌ కొళ్ల ఫారమ్స్‌లో కూడా నష్టాలు రావటంతో గణేష్ ఆర్ధికంగా వెనకబడ్డాడు.

దీంతో కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్న గణేష్‌ ఈ మధ్యే నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చాడు. మహేష్‌ బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మరోసారి కమెడియన్‌గా రీ ఎంట్రీ ఇచ్చాడు గణేష్. ఈ సినిమాలో బ్లేడ్‌ గణేష్‌గా కమెడి పండించే ప్రతయ్నం చేసిన గణేష్‌ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. ఈ సినిమాలో గణేష్ క్యారెక్టర్ పెద్దగా వర్క్‌ అవుట్ కాకపోగా గణేష్ ఇమేజ్ మరింతగా బ్యాడ్‌ అయ్యింది.

తాజాగా మీడియాతో మాట్లాడిన గణేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాలో తన పాత్ర గురించి స్పందించాడు. ఆ సినిమాలో కమెడియన్‌ పాత్ర తాను చేయకుండా ఉండాల్సింది అంటూ కామెంట్‌ చేశాడు. ఆ సినిమాతో తన పాత్రు ఇంట్లో నా పిల్లలు తిట్టారని చెప్పాడు గణేష్. సినిమా సూపర్ హిట్ అయినా ఆ సినిమాలోని పాత్ర తన కెరీర్‌కు ఏ మాత్రం ఉపయోగపడలేదని చెప్పాడు. అంతేకాదు ఇక నటించనని చెప్పిన గణేష్ గుండెలు పిండేసే పాత్ర ఏదైనా వస్తేనే చేస్తానని చెప్పాడు.