పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ బర్త్ డే సెలెబ్రేషన్స్ కు అభిమానులు సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వయసు 49 ఏళ్ళు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ 50వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ బర్త్ డే సెలెబ్రేషన్స్ కు అభిమానులు సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వయసు 49 ఏళ్ళు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ 50వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నాడు. సాధారణంగానే పవన్ జన్మదిన వేడుకలకు అభిమానుల హంగామా ఆకాశాన్ని తాకే విధంగా ఉంటుంది. 

అలాంటిది ప్రతిష్టాత్మకమైన హాఫ్ సెంచరీ బర్త్ డే సెలబ్రేషన్స్ అయితే ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోవడం కష్టం. ఇప్పటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో పవన్ అభిమానులు జన్మదిన వేడుకలకు ప్రిపరేషన్స్ మొదలు పెట్టేస్తున్నారు. 

పవన్ కళ్యాణ్ ని దైవంలా ఆరాధించే గబ్బర్ సింగ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కూడా పవన్ ఫ్యాన్స్ తో సెలెబ్రేషన్స్ కోసం జాయిన్ కాబోతున్నాడు. సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే సందర్భంగా బండ్ల గణేష్ సంచలన ప్రకటన చేశారు. ఆ రోజున తెలుగు రాష్ట్రాల్లో గబ్బర్ సింగ్ చిత్రాన్ని 100 షోలు ప్రదర్శించబోతున్నట్లు తెలిపారు. 

దీనితో సోషల్ మీడియాలో అభిమానుల ట్రెండ్ మొదలైపోయింది. అభిమానులంతా తమకు దగ్గర్లో ఉండే థియేటర్స్ లో టికెట్స్ బుక్ చేసుకోవాల్సిందిగా బండ్ల గణేష్ సోషల్ మీడియాలో కోరాడు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో గబ్బర్ సింగ్ చిత్రం సెప్టెంబర్ 2న ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది. 

హరీష్ శంకర్ దర్శకత్వంలో, బండ్ల గణేష్ నిర్మాతగా తెరకెక్కిన గబ్బర్ సింగ్ మూవీ పవర్ స్టార్ కెరీర్ లో ఎప్పటికి స్పెషల్ మూవీ. ప్రస్తుతం అదే హరీష్ దర్శకత్వంలో పవన్ రెండవ సారి నటించేందుకు రెడీ అవుతున్నారు. 

Scroll to load tweet…