ఇండియాలోనే టాప్‌ షోగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు దీనికి రెండో సీజన్‌ ప్రారంభిస్తున్నారు. దీనికి సంబంధించిన `అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే2` షో ట్రైలర్‌ విడుదలైంది. 

`గెలుపే ఊపిరిగా, పట్టుదలే ప్రాణంగా, ఆశయమే గమ్యంగా పోరాడే యోధుడికి విజయం అన్‌స్టాపబుల్‌` అని అంటున్నారు బాలయ్య. ఆయన హోస్ట్ గా చేస్తున్న షో `అన్‌స్టాపబుల్‌2`. గతేడాది `ఆహా`లో ప్రసారమైన `అన్‌ప్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే` ఎంత పాపులర్‌ అయ్యిందో తెలిసిందే. ఇండియాలోనే టాప్‌ షోగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు దీనికి రెండో సీజన్‌ ప్రారంభిస్తున్నారు. దీనికి సంబంధించిన `అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే2` షో ట్రైలర్‌ విడుదలైంది. 

ఇందులో బాలయ్య అదరగొడుతున్నారు. ముఖ్యంగా ఆయన లుక్‌ అదరగొడుతుంది. ట్రైలర్‌లో `అంధకార అభయరణ్యంలో నిక్షిప్తమైన నిగూఢ నిధి అన్ ఇమాజినబుల్‌.. అక్కడ ఎదురయ్యే సవాళ్లు అన్‌ ప్రెడిక్టబుల్.. అయినా ఆగని మన పోరాటం అన్‌ స్టాపబుల్‌. గెలుపే ఊరిపిగా, పట్టుదలే ప్రాణంగా ఆశయమే గమ్యంగా పోరాడే యోధుడికి విజయం అన్‌ స్టాపబుల్. ప్రశ్నల్లో మరింత ఫైర్, ఆటల్లో మరింత డేర్‌.. సరదాల్లో మరింత సెటైర్‌.. మీ కోసం మరింత రంజుగా.. దెబ్బకి థింకింగ్‌ మారిపోవాలా?` అని బాలయ్య డైలాగులతో, ఆయన యాక్షన్‌తో సాగే ఈ ట్రైలర్‌ ఆద్యంతం రక్తికట్టించేలా ఉంది. 

ఇందులో ఓ మిస్టీరియస్‌ ప్రాంతంలో ఓ నిధి కోసం బాలయ్య అన్వేషిస్తుండగా, ఇందులో ఓ నిధి పెట్టేని కనిపెట్టిన బాలయ్య అందులో నుంచి బంగారు ఖడ్గాన్ని తీసుకుని ఆయన అట్నుంచి ఆయన అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే 2` షో హౌజ్‌లోకి రావడం విశేషం. ఇందులో బాలయ్య లుక్‌ మరింత ఆకట్టుకునేలా ఉంది. అదే సమయంలో ఆయన యంగ్‌గానూ ఉండటం విశేషం. బాలకృష్ణని ఇంత యంగ్‌గా చూపించడంతో దర్శకుడు ప్రశాంత్‌ వర్మని అభిమానులు అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. 

Scroll to load tweet…

ప్రస్తుతం ఇది అటు సోషల్‌ మీడియాలో, ఇటు యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. ఇక ఈ సెలబ్రిటీ టాక్ షో రెండో సీజన్ అక్టోబర్ 14నుంచి ప్రసారం కానుంది. ప్రతి శుక్రవారం ఒక్కో ఎపిసోడ్‌ ప్రసారం కానుందని నిర్వహకులు ఈ ట్రైలర్లో వెల్లడించారు. అయితే ఈ సారి మొదటి ఎపిసోడ్‌కి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గెస్ట్ గా వస్తున్న విషయం తెలిసిందే. ఆయనకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయ్యింది. మొదటి సీజన్‌లో అంతా సినీ సెలబ్రిటీలే సందడి చేశారు. కానీ ఈ సారి రాజకీయ నాయకులను కూడా ఆహ్వానించబోతున్నట్టు తెలుస్తుంది.