షాక్ ఇచ్చిన బాలయ్య ‘బీబీ-3’ ఓవర్సీస్ రైట్స్
ఓవర్సీస్ బిజినెస్ కూడా పూర్తైంది. ఓవర్సీస్‌లో ‘బీబీ 3’ థియేట్రికల్ రైట్స్ రూ.2 కోట్లకు అమ్ముడుపోయాయి రికార్డ్ క్రియేట్ చేసింది. బాలయ్య చిత్రానికి రెండు కోట్లు అంటే మామూలు విషయమేం కాదు.. భారీ ధరే అంటున్నారు. అప్పట్లో ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో మంచి ఆఫర్ వచ్చినా కలెక్షన్స్ మాత్రం ఆశించింనంతగా రాలేదు. అయితే.. ‘బీబీ3’ రైట్స్ రెండు కోట్లకు అంటే బాలయ్యకు ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రేట్ అని చెప్పాలి.
సింహా, లెజండ్ చిత్రాల తరువాత బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్‌లో మూడో మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌కి ముందే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాగా.. కరోనాతో ఆగిపోయింది. అయితే రీసెంట్ ఈ మూవీ తాజా షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. బిబి3 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతన్న ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని వినపడుతోంది. ప్రస్తుతం అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో ఈ చిత్రం షూటింగ్ విజయవంతగా జరుగుతోంది.
30 లక్షల రూపాయిలతో నిర్మించిన భారీ టెంపుల్ సెట్‌లో గత నాలుగైదు రోజులుగా కీలక సీన్స్ ను షూట్ చేస్తున్నారు. ఇంకో రెండు వారాల పాటు ఇక్కడే షూటింగ్ జరుగుతోందని టాక్. ఇదిలా ఉంటే.. సినిమా రిలీజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పటికే ప్రారంభమైపోయింది. టైటిల్ కూడా ఇంకా ఫిక్స్ కానీ ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ లో కొత్త రికార్డ్ లు క్రియేట్ చేస్తుందని చెప్తున్నారు.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు...ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే...ఆంధ్రా రైట్స్ ఇప్పటికే రూ.35 కోట్లు పలకినట్లు.. నైజాం, ఉత్తరాంధ్ర రైట్స్‌ను రూ. 16 కోట్లకు దిల్‌రాజు దక్కించుకున్నాడని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఓవర్సీస్‌తో బిజినెస్ కూడా పూర్తైంది. ఓవర్సీస్‌లో ‘బీబీ 3’ థియేట్రికల్ రైట్స్ రూ.2 కోట్లకు అమ్ముడుపోయాయి రికార్డ్ క్రియేట్ చేసింది. బాలయ్య చిత్రానికి రెండు కోట్లు అంటే మామూలు విషయమేం కాదు.. భారీ ధరే అంటున్నారు. అప్పట్లో ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో మంచి ఆఫర్ వచ్చినా కలెక్షన్స్ మాత్రం ఆశించింనంతగా రాలేదు. అయితే.. ‘బీబీ3’ రైట్స్ రెండు కోట్లకు అంటే బాలయ్యకు ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రేట్ అని చెప్పాలి.
మరో ప్రక్క ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, హీరోయిన్ గురించి రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు మోనార్క్ టైటిల్ ను ఖరారు చేసే విషయంలో యూనిట్ సభ్యులు మధ్య చర్చలు జరుపుతున్నారు. మోనార్క్ టైటిల్ వల్ల ఖచ్చితంగా సినిమా గురించి జనాల్లో చర్చ జరగడంతో పాటు టైటిల్ చాలా క్యాచీగా ఉంటుందని టీమ్ భావిస్తున్నారు. మరో ప్రక్క ఈ సినిమాకు ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ ఫిక్స్ అయిందని టాక్ నడుస్తోంది. త్వరలోనే టైటిల్ విషయంలో తుది నిర్ణయం తీసుకుని షూటింగ్ మొదలు అయిన వెంటనే పోస్టర్ లేదా టీజర్ ను విడుదల చేయాలని భావిస్తున్నారట చిత్రయూనిట్ .
తమన్ స్వరకర్తగా.. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ కథానాయికలుగా నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య మే-28న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా హ్యాట్రిక్ కొడుతుందో లేదో వేచి చూడాలి. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు.