ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా నిన్న రాత్రి  విడుదలైన నందమూరి బాలకృష్ణ ‘వీర సింహారెడ్డి’ ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం యూట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతూ.. మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుంటోంది.   

నందమూరి నటసింహాం బాలకృష్ణ (Balakrishna) లేటెస్ట్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy). మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చిత్ర ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. నిన్న ఒంగోలులో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవంతం అయ్యింది. గాడ్ ఆఫ్ మాస్ బాలయ్య మూవీ ఈవెంట్ ను అభిమానులు పండగలా జరుపుకున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా చిత్ర యూనిట్ ‘వీరసింహారెడ్డి ట్రైలర్’ను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇంటర్నెట్ లో దూసుకుపోతోంది. బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్, మాస్ యాక్షన్ సీన్స్ నెక్ట్స్ లెవల్ లో ఉన్నాయి. అలాగే విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోంది. ఇక బాలయ్య డాన్స్ కూడా ఆకట్టుకుంటోంది. దీంతో ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లోకి వచ్చింది. #1లో ట్రెండ్ అవుతోంది. 14 గంటలల్లో దాదాపుగా 5 మిలియన్ల వ్యూస్, 300కే లైక్స్ ను దక్కించుకోవడం విశేషం. 

ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన పాటలు,టీజర్, గ్లింప్స్ కు భారీ రెస్పాన్స్ దక్కుతున్న విషయం తెలిసిందే. ఇక ట్రైలర్ కూడా దూసుకుపోవడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. బాలయ్య సరసన గ్లామర్ బ్యూటీ శ్రుతి హాసన్ (Shruti Haasan) తొలిసారిగా నటిస్తోంది. శ్రీలీల, దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. 

View post on Instagram