Asianet News TeluguAsianet News Telugu

రూ.100 కోట్ల క్లబ్ లోకి ‘భగవంత్ కేసరి’.! సాలిడ్ కలెక్షన్స్.. వరల్డ్ వైడ్ షేర్ ఎంతంటే?

నందమూరి బాలకృష్ణ (Balakrishna) ‘భగవంత్ కేసరి’ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. పాజిటివ్ టాక్ అందడంతో సినిమా కలెక్షన్లూ సాలిడ్ గానే ఉన్నాయి. నాలుగురోజుల వసూళ్లు అదిరిపోయాయి. 
 

Balakrishnas Bhagavanth Kesari four days Collections NSK
Author
First Published Oct 24, 2023, 11:57 AM IST

నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ ఫిల్మ్ ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari)  బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. అక్టోబర్ 19న ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదలైన విషయం తెలిసిందే. తొలిరోజే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ అందింది. ప్రేక్షకుల నుంచి బ్రహ్మండమైన స్పందనను దక్కించుకోవడంతో పాటు బాక్పాఫీస్ వద్ద కలెక్షన్లలో దుమ్ములేపుతోంది. ఈ చిత్రంతొలిరోజే అదిరిపోయే వసూళ్లను రాబట్టింది. ఇక నాలుగు రోజుల కలెక్షన్లూ సాలిడ్ గానే ఉన్నాయి. 

నందమూరి నటసింహం బాలకృష్ణ - టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ32.33 కోట్లు రాబట్టింది. రెండు రోజుల్లో రూ.51 కోట్లు అందుకుంది. ఇక మొదటి వీకెండ్ పూర్తవ్వడం సాలిడ్ మార్క్ ను చేరుకుంది. తాజాగా భగవంత్ కేసరి నాలుగు రోజుల కలెక్షన్లను మేకర్స్  అధికారికంగా ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.106.2 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇప్పటికే చివరి రెండు చిత్రాలతో హిట్ అందుకున్నారు. ఈ చిత్రం కూడా బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ చిత్రం ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.50 కోట్ల  షేర్ వసూల్ చేసినట్టు అధికారికంగా ప్రకటించారు. సీనియర్ హీరో హ్యాట్రిక్ హిట్ అందుకోవడం విశేషమని తెలిపారు. ఇక ఆరోజు రెస్పాన్స్ మరింత హైలో ఉండనుందని భావిస్తున్నారు. 

ఈరోజు కూడా ‘భగవంత్ కేసరి’ బుకింగ్స్ జోరుగా ఉన్నాయి. బుక్ మై షోలో ఈ చిత్రానికే ప్రేక్షకులకు మొగ్గుచూపుతున్నారు. ఫెస్టివల్ తర్వాత మరింతగా బుకింగ్  పెరుగుతుండటం విశేషం. దీంతో ఈ చిత్రం మున్ముందు సూపర్ కలెక్షన్లు అందుకుంటుందని అంటున్నారు. ఇక ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా నటించింది. శ్రీలీలా కూతురు పాత్ర పోషించింది. నేషనల్ అవార్డు విన్నర్ అర్జున్ రాంపాల్ విలన్ గా అలరించారు. థమన్ సంగీతంతో అద్భుతమనిపించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుందీ చిత్రం. 

 

Follow Us:
Download App:
  • android
  • ios