జై బాలయ్య అంటూ థియేటర్లు మారుమోగుతున్నాయి. వీరసింహారెడ్డి రిలీజ్ తో పూనకాలు తెచ్చుకుని ఊగిపోతున్నారు బాలయ్య ఫ్యాన్స్. ఆయన్ను తెరపై చూస్తేనే అభిమానులు ఆవేశం ఆపుకోలేదు. ఇక అభిమానులతో కలిసి స్వయంగా బాలకృష్ణ సినిమా చూస్తే.. ఆసందడి వేరే విధంగా ఉంటుంది.
జై బాలయ్య అంటూ థియేటర్లు మారుమోగుతున్నాయి. వీరసింహారెడ్డి రిలీజ్ తో పూనకాలు తెచ్చుకుని ఊగిపోతున్నారు బాలయ్య ఫ్యాన్స్. ఆయన్ను తెరపై చూస్తేనే అభిమానులు ఆవేశం ఆపుకోలేదు. ఇక అభిమానులతో కలిసి స్వయంగా బాలకృష్ణ సినిమా చూస్తే.. ఆసందడి వేరే విధంగా ఉంటుంది.
ఫ్యాన్స్ కు భారీ యాక్షన్ ట్రీట్ ఇచ్చాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. వీరసింహారెడ్డి సినిమాతో ఈరోజు ఆడియన్స్ ముందుకువచ్చిన బాలయ్య.. స్వయంగా అభిమానులతో కలిసి సినిమా చూశారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఆయన సందడి చేశారు. నందమూరి నటసింహం నటించిన వీరసింహా రెడ్డి సినిమా కూకట్‌పల్లిలోని భ్రమరాంబ థియేటర్‌లోబెనిఫిట్ షో ప్రదర్శించారు. ఈసినిమాను ఆడియన్స్ తో కలిసి చూడాలని బాలయ్య అక్కడికి వచ్చారు. ఇక బాలయ్య రాకతో థియేటర్ అంతా హడావిడిగా మారింది. ఆయన ఫ్యాన్స్‌తో థియేటర్ నిండిపోయింది. జై బాలయ్య నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది.
బాలయ్య బాబుకు మేళాలు, డప్పులు, బ్యాండ్‌బాజాలతో సుస్వాగతం పలికారు నందమూరి అభిమాన సేన. తమ అభిమాన హీరో తమతో కలిసి సినిమా చూడటానికి రావడం తో వారు సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఇక ప్రేక్షకుల మధ్యలో కూర్చుని సినిమా చూడటం చాలా బాగా అనిపించిందని. వారి స్పందన చూసి చాలా సంతోషం అనిపించిందన్నారు బాలకృష్ణ. ప్రేక్షకులు స్పందన స్వయంగా చూడటం కోసమే ఇలా వచ్చానన్నారు.
ఇక సంక్రాంతి కానుకగా బాలయ్య బాబు నటించిన వీరసింహారెడ్డి ఆరోజు ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో రిలీజ్అయ్యింది. మలినేని గోపీచంద్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా శృతి హాసన్ నటించారు. ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. మొదటి నుంచే వీరసింహారెడ్డి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకుతగ్గట్టే ఊరమాస్ యాక్షన్ ట్రీట్ ఇచ్చారు బాలకృష్ణ. ఈరోజు ఉదయం 1 నుంచే విదేశాల్లోప్రీమిచర్ షోలతో సందడిచేశాడు వీర సింహారెడ్డి.
