నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్. నటసింహం బాలయ్య నుంచి మరో కొత్త కోణం చూడబోతున్నారు అభిమానులు. ఇప్పటికే హోస్ట్ గా సక్సెస్ అయిన ఆయన.. డిజిటల్ ప్లాట్ ఫామ్ పై మరో కొత్త అవతారం ఎత్తబోతున్నారు.
అభిమానుల కోసం మరో కొత్త అవతారం ఎత్తబోతున్నాడు నందమూరి నటవారసుడు..నట సింహం బాలయ్య బాబు. ఇప్పటికే వరుస విజయాలతో అభిమానులను ఉర్రూతలూగిస్తున్న బాలయ్య.. హోస్ట్ గా మారి.. ఆహలో అన్ స్టాపబుల్ అంటూ.. ఉర్రూతలూగించారు. టాలీవుడ్ స్టార్ హీరోలను ఇంటర్వ్యూలు చేసి.. వారిలో కొత్త కోణం బయటకు తీశారు. ఇప్పటి వరకూ ఎవరి ఇంటర్వ్యూలకు రాని స్టార్స్ కూడా బాలకృష్ణ షోకు వచ్చి సందడి చేశారు. ఇక హీరోగా.. హోస్ట్ గా సక్సెస్ ఫుల్ గా ఫామ్ లో ఉన్న బాలకృష్ణ.. ఇప్పుడు మరో సారి కొత్త నిర్ణయం తసుకున్నారట.
100కు పైగా సినిమాలు చేసిన నట సింహం.. అన్ స్టాపబుల్ అంటూ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లోకి వచ్చి మెప్పించారు. తొలి షోతోనే భారీ విజయాన్ని నమోదు చేసుకున్నారు. దీంతో బాలయ్య ఏదైనా చేయగలరు అంటూ నమ్మకం వచ్చేసింది. ఇక ఆహాలో అన్ స్టాపబుల్ తో సక్సెస్ అవ్వడంతో ఈ టాక్ షో నిర్మాత అల్లు అరవింద్ బాలకృష్ణతో వెబ్ సిరీస్ చేస్తే బాగుంటుందన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై బాలకృష్ణతో చర్చలు జరుపుతున్నారట. బాలయ్య బాబు దీనికి సై అంటే .. బాలయ్యలో మరో కోణం చూడబోతున్నారు అభిమానులు. ఇప్పటికే సీనియర్ హీరోలు కూడా చాలామంది వెబ్ కంటెంట్ లోకి ఎంటర్ అవుతున్నార. ప్రముఖ తారలంతా ఓటీటీ బాట పడుతున్న సంగతి తెలిసిందే.
రీసెంట్ గా బాలయ్య సరిసమానమైన హీరో వెంకటేష్ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ఎక్కాడు. రానా తో కలిసి రానా నాయుడు గా సందడి చేస్తున్నాడు.
ఇక హీరోయిన్లలో స్టార్ హీరోయిన్లు కూడా ఓటీటీ వైపు చూస్తున్నారు. ఈక్రమంలోనే బాలయ్యను కూడా వెబ్ కంటెంట్ వైపు తీసుకురావాలి అని చూస్తున్నాడట అరవింద్. ఈక్రమంలో బాలకృష్ణ కనుకు వెబ్ సిరీస్ చేస్తూ.. ఓటీటీ రేటింగ్ బ్లాస్ట్ అవ్వడం ఖాయం అంటున్నారు సినీ పండితులు.
ఇక ప్రస్తుతం బాలకృష్ణ 108 మూవీ చేస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈమూవీ తెరకెక్కబోతోంది. ఈసినిమా తరువాత పూరీ జగన్నాథ్ తో కూడా మూవీ ఉన్నట్టు సమాచారం. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్లాక్ బస్టర్స్ సాధించిన బాలయ్య.. అనిల్ రావిపూడి సినిమాతో హ్యాట్రిక్ హిట్ సాధించడానికి రెడీగా ఉన్నాడు. తెలంగాణా బ్రాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది.
