సినిమా క్యాన్సిల్ అయితే గుడ్ న్యూస్ ఎలా అవుతుందని అనుకుంటున్నారా..? ఎందుకంటే క్యాన్సిల్ అయింది రవికుమార్ సినిమా.. సో బాలయ్య ఇప్పుడు బోయపాటి సినిమా మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

వివరాల్లోకి వెళితే.. బాలకృష్ణ ముందుగా బోయపాటి సినిమాను మొదలుపెట్టాలి కానీ రవికుమార్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సి.కళ్యాణ్ నిర్మాత. కానీ ఇప్పుడు ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే ఈ సినిమాలో జగపతిబాబు డ్యూయల్ రోల్ పోషించాల్సింది.

ఈ డబుల్ రోల్ లో జగపతిబాబు తాత, మనవడిగా కనిపిస్తారని తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో తాత విలన్.. తరువాత మనవడు విలన్. ఈ రెండు విలన్ క్యారెక్టర్లు వైఎస్ రాజారెడ్డి, వైఎస్ జగన్ లను గుర్తుచేసేలా రాసుకున్నారట. ఇప్పుడు ఏపీలో జగన్ ముఖ్యమంత్రి కానున్నాడు.

ఇలాంటి సమయంలో ఈ కథతో సినిమా తీస్తే.. వివాదాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. అందుకే సైలెంట్ గా ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు కథ  మార్చాలంటే చాలా మార్చాల్సివుంది. అందుకే పక్కన పెట్టేస్తే మంచిదని భావిస్తున్నారు. మరోపక్క దర్శకుడు కథ మార్చి ప్రాజెక్ట్ నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడట. మరేం జరుగుతుందో చూడాలి!