భగవంత్ కేసరి చిత్రంతో హిట్ కొట్టిన దర్శకుడు అనిల్ రావిపూడి విలువైన బహుమతులు అందుకుంటున్నాడు. నిర్మాత ఆయనకు కాస్ట్లీ కారు బహుమతిగా ఇచ్చాడు.
హీరో బాలకృష్ణ వరుస విజయాలతో జోరు మీదున్నారు. ఆయన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి సైతం సక్సెస్ కొట్టింది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో ఆయన హ్యాట్రిక్ పూర్తి చేశాడు. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన భగవంత్ కేసరి వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఆదరించారు. యంగ్ బ్యూటీ శ్రీలీల కీలక రోల్ చేయగా కాజల్ హీరోయిన్ గా నటించింది.
భగవంత్ కేసరి చిత్రంలో ప్రతినాయకుడు పాత్ర అర్జున్ రాంపాల్ చేశాడు. షైన్ స్క్రీన్ బ్యానర్ లో భగవంత్ కేసరి చిత్రాన్ని నిర్మించారు. భగవంత్ కేసరి సక్సెస్ నేపథ్యంలో నిర్మాతలు ఫుల్ ఖుషీగా ఉన్నారు. దర్శకుడు అనిల్ రావిపూడికి విలువైన బహుమతి ఇచ్చారు. టయోటా వెల్లిఫైర్ బ్రాండ్ న్యూ మోడల్ కారు నిర్మాతల నుండి అందుకున్నాడు అనిల్ రావిపూడి.
ఇక ఈ కారు ధర చూస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే. ఇండియాలో టయోటా వెల్లిఫైర్ ధర రూ. 1.2 కోట్ల నుండి 1.3 కోట్ల వరకూ ఉంది. ఇక భగవంత్ కేసరి డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం స్ట్రీమ్ అవుతుంది. ఓటీటీలో కూడా భగవంత్ కేసరి విశేష ఆదరణ దక్కించుకుంటుందని సమాచారం. భగవంత్ కేసరి చిత్రానికి థమన్ సంగీతం అందించాడు.
