బాలకృష్ణ పాట పాడి ఆకట్టుకున్నారు. ఆయన విదేశాల్లో ఏకంగా లైవ్‌లో పాట పాడి అలరించడం విశేషం. ప్రస్తుతం ఈ పాట వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

నందమూరి బాలకృష్ణ.. అద్భుతమైన నటనకు మారుపేరు. యాక్షన్‌కి కేరాఫ్‌. ఒళ్లుగగొర్పొడిచే డైలాగ్‌ డెలివరికీ ప్రతిబింబం. ఆయన అడపాదడపా తన గొంతుని సవరించారు. పాటలతో అలరించారు. తన సినిమాల్లోనూ ఆయన పాటలు పాడిన సందర్భాలున్నాయి. తాజాగా లైవ్‌లో పాట పాడి వాహ్‌ అనిపించారు. అంతేకాదు ఆయన పాటకి ఆడియెన్స్ స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇవ్వడం విశేషం. ఆ వివరాలు చూస్తే, 

ఎన్టీఆర్‌(సీనియర్‌) శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఖతార్‌లోని దోహాలో ఓ ఈవెంట్‌లో గెస్ట్ గా పాల్గొన్నారు బాలయ్య. ఇందులో ఆయన పాట పాడటం విశేషం. అభిమానుల కోరిక మేరకు ఎన్టీఆర్‌ నటించిన `జగదేకవీరుడుని` చిత్రంలోని శివశంకరీ పాటని అద్భుతంగా ఆలపించారు. ప్రొఫేషనల్‌ సింగర్‌ తరహాలో ఆయన పాట పాడటం విశేషం. బాలయ్య పాటకి అభిమానులు ఫిదా అయ్యారు. చప్పట్లతో మారు మోగడమే కాదు, స్టాండింగ్‌ ఓవేషన్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతుంది. నెట్టింట చక్కర్లు కొడుతుంది. అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. గతంలోనూ ఒక స్టేజ్‌పై ఇదే శివశంకరీ పాటను ఆలపించారు. అంతేకాదు ఆయన ఓ ప్రత్యేక వీడియోని కూడా విడుదల చేశారు. 

Scroll to load tweet…

బాలకృష్ణ వరస విజయాలతో జోరు మీదున్నారు. ఆయన `అఖండ`, `వీరసింహారెడ్డి`లతో బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్లు అందుకున్నారు. ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చేస్తున్నారు. `ఎన్బీకే108` పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రీలీలా బాలయ్యకి కూతురు పాత్రలో కనిపిస్తుందని సమాచారం. ఈ చిత్రం దసరాకి విడుదల కానుంది. ఆ తర్వాత బోయపాటి శ్రీనుతో ఓ పొలికల్‌ నేపథ్యంలో సినిమా చేయనున్నారు బాలయ్య.