బాలయ్య తన గత చిత్రం రూలర్ లో పెట్టుకున్న విగ్గులకు ఓ రేంజిలో విమర్శలు ఎదుర్కొన్నారు. ఆయన విగ్గులపై తెగ జోకులు పేలాయి. ఈ విషయం బాలయ్యకీ చేరింది. ఇక తను భవిష్యత్తులే చేసే సినిమాల్లో విగ్గులు వాడకూడదని ఫిక్స్ అయ్యారు. అందుకోసం హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు సిద్దపడ్డారు. అంతవరకూ బాగానే ఉంది. అయితే ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ..ఈ హెయిల్ ప్లాంటేషన్ ఏదైతో ఉందో అది బాలయ్య విషయంలో ఫెయిల్ అయ్యిందట. ఏ విధమైన ఫలితం ఇవ్వలేదట. చాలా పేరున్న నిపుణుల సమక్షంలో చేసినా ఫలితం కనపడకపోవటం ఆయన్ను నిరాశపరిచిందట.

ఆ కష్టాలు అక్కడితో తీరిపోలేదు. గతంలోలోగా ఏదో విగ్గు పెట్టుకుని బయిటకు వెళ్లటానికి కుదరదని డాక్టర్స్ చెప్పారట. ట్రాన్సప్లెంట్ చేసిన ఏరియాలో ఇబ్బందులు వస్తాయని..కాబట్టి ఎట్టి పరిస్దితుల్లోనూ విగ్గులు కానీ మరే ఏ ఇతర హెయిల్ ఎక్సటెన్షన్స్ వాడద్దు అని క్లియర్ గా చెప్పారట. అందుకే బాలయ్య ..విగ్గు లేకుండా బయిట కనపడుతున్నారు.
 
మరి బోయపాటి శ్రీను సినిమా విషయం ఏమిటనేది ఇప్పుడు బాలయ్య ముందున్న ప్రధాన ప్రశ్న. ఫారిన్ ఇంపోర్టెడ్ మెటీరియల్ తో ఈ సినిమాకు లాగిద్దామని బోయపాటి చెప్పారట. ఈ లోగా మరోసారి హెయిర్ ట్రాన్సప్లెంటేషన్ చేయించుకోవాలని బాలయ్య మాత్రం ఫిక్స్ అయ్యారట. ఈ సారి ఖచ్చితంగా సక్సెస్ అయ్యేలా అన్ని జాగ్రత్తలు తీసుకుందామని డాక్టర్స్ చెప్పారట.  

ఈ సారి జుట్టు.. ఒరిజినల్ అనిపించేలా అత్యున్నత స్థాయిలో, ఎక్కువ ఖర్చుతో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయిస్తున్నారని.. అది వర్కవుట్ అయితే ఇక బాలయ్యకు విగ్గు కష్టాలు తీరినట్లే అని చెప్తున్నారు. ఈ జుట్టు సెట్ అయ్యాకే బాలయ్య బోయపాటి దర్శకత్వంలో తన కొత్త చిత్రాన్ని మొదులు పెడదాం అని చెప్పినట్లు సమాచారం.