Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ పుట్టాకే ఆవేశం పుట్టింది... వర్ధంతినాడు బాలయ్య ఆసక్తికర కామెంట్స్!

ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు వింటే ఆవేశం వస్తుందని, ఎన్టీఆర్ పుట్టాకే ఆవేశం పుట్టిందని బాలయ్య చెప్పడం విశేషం. ఎందరో మహానుభావులు తెలుగు గడ్డపై జన్మించగా... వారి సరసన ఎన్టీఆర్ ఉంటారు అన్నారు. ఎన్టీఆర్ కి భారత రత్న వచ్చే వరకు పోరాడుతాం అని బాలయ్య చెప్పడం జరిగింది. 

balakrishna interesting comments on ntrs death anniversary ksr
Author
Hyderabad, First Published Jan 18, 2021, 12:00 PM IST

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి పురస్కరించుకొని అభిమానులు, కుటుంబ సభ్యులు  ఆయనను స్మరించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కుమారుల్లో ఒకరైన బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ ని సందర్శించారు. సమాధి వద్ద  తండ్రికి నివాళులు అర్పించిన బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కీర్తిని ఆయన కొనియాడారు. 

సాధారణ రైతు కుటుంబంలో పుట్టి చిత్ర పరిశ్రమపై మక్కువతో మద్రాసు వెళ్లిన ఎన్టీఆర్, అద్భుతమైన పాత్రలు చేసి ట్రెండ్ సెట్ చేశారు అన్నారు. తిరుగులేని కథానాయకుడిగా ఎదిగిన ఎన్టీఆర్, ప్రజలకు మేలు చేయాలనే తపనతో రాజకీయాలలోకి వచ్చి, ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవ చేశారు అన్నారు. తెలుగువారి ఆత్మ గౌరవం ప్రపంచం నలుమూలలకు చాటిన యుగ పురుషుడు ఎన్టీఆర్ అని ఆయన అన్నారు. 

ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు వింటే ఆవేశం వస్తుందని, ఎన్టీఆర్ పుట్టాకే ఆవేశం పుట్టిందని బాలయ్య చెప్పడం విశేషం. ఎందరో మహానుభావులు తెలుగు గడ్డపై జన్మించగా... వారి సరసన ఎన్టీఆర్ ఉంటారు అన్నారు. ఎన్టీఆర్ కి భారత రత్న వచ్చే వరకు పోరాడుతాం అని బాలయ్య చెప్పడం జరిగింది. 1996 జనవరి 18న ఎన్టీఆర్ తన నివాసంలో గుండెపోటుతో మరణించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios