నందమూరి బాలకృష్ణ ఇటీవలే భారత అత్యున్నత పురస్కారం పద్మ భూషణ్ ని అందుకున్న విషయం తెలిసిందే. రాష్ర్టపతి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు బాలయ్య. తనకు ఈ అవార్డు సరైన సమయంలోనే వచ్చిందని ఆయన ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాదు తనతో సినిమాలు చేసిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. తనకు వచ్చిన గొప్ప పాత్రల వల్లే తనకు ఇంతటి పేరు, గుర్తింపు వచ్చిందన్నారు.
బాలయ్య ప్రస్తుతం సినిమాల పరంగా మంచి సక్సెస్ ఊపులో ఉన్నారు. ఇప్పటి వరకు ఆయన వరుసగా నాలుగు విజయాలను అందుకున్నారు. `అఖండ`తో ప్రారంభమైన సక్సెస్ పరంపర `వీరసింహారెడ్డి`, `భగవంత్ కేసరి`, `డాకు మహారాజ్` తో కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ కి రెడీ అవుతున్నారు. అందులో భాగంగా ఇప్పుడు `అఖండ 2` లో నటిస్తున్నారు. మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను లైన్‌లో పెడుతున్నారు.
`జైలర్ 2` సినిమాలో బాలకృష్ణ
ఈ క్రమంలో బాలయ్యకి సంబంధించిన ఒక మతిపోయే వార్త వైరల్ అవుతుంది. సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి బాలయ్య సినిమా చేయబోతున్నారట. `జైలర్ 2`లో బాలయ్య నటించబోతున్నారట. ఈ వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు మరోసారి ఈ వార్తలు వైరల్ గా మారాయి.
`జైలర్ 2`లో మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ గెస్ట్ రోల్స్
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ `జైలర్ 2`లో నటిస్తున్నారు. ఇది రెండేళ్ల క్రితం వచ్చిన `జైలర్` చిత్రానికి సీక్వెల్. యాక్షన్ ప్రధానంగా రూపొందిన ఈ మూవీ అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది. రజనీకాంత్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇందులో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ గెస్ట్ రోల్స్ చేశారు. వీరి గెస్ట్ రోల్స్ సినిమాకి హైలైట్‌గా నిలిచాయి.
బాలయ్య ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా `జైలర్ 2`
ఈ క్రమంలో ఇప్పుడు `జైలర్ 2`ని కూడా దాన్ని మించి రూపొందిస్తున్నారు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. అయితే ఇందులో బాలయ్య ని ఒక ముఖ్య పాత్ర కోసం అప్రోచ్ అయ్యారట నెల్సన్. కథ విని, తన పాత్ర విని బాలయ్య ఓకే చెప్పినట్టు సమాచారం. ఇందులో బాలయ్య పాత్ర వేరే లెవల్‌లో ఉంటుందని, సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లేలా ఉంటుందని సమాచారం.
దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ మూవీ ఇటీవల షూటింగ్ ప్రారంభమైంది. రజనీకాంత్‌తోపాటు బాలయ్య, శివరాజ్‌కుమార్, మోహన్ లాల్ ఒకే సినిమాలో కనిపిస్తే ఫ్యాన్స్ కి రెండు కళ్లు చాలవని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.


