స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో మోక్షజ్ఞ మాట కలిపారు. ఇద్దరి మధ్య ఫోన్ నంబర్స్ ఎక్స్ఛేంజ్ అయ్యాయి. దీంతో ప్రాజెక్ట్ సెట్ అయ్యిదంటూ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.  


మోక్షజ్ఞ హీరో అవుతాడా? లేదా?... ఇదో మిలియన్ డాలర్ ప్రశ్న. గత పదేళ్లుగా వీడని చిక్కుముడి. బాలయ్య అభిమానులు మోక్షజ్ఞ రాక కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మీరు ఎంట్రీ ఇవ్వండి స్టార్ హీరో చేసి నెత్తిన పెట్టుకుంటాం అంటున్నారు. ఈ క్రమంలో బాలయ్య మీద ఒత్తిడి పెంచేస్తున్నారు. ప్రతి ఏడాది మోక్షజ్ఞ బర్త్ డే వేడుకలు అభిమానులు ఘనంగా నిర్వహిస్తారు. 

ఇక పలుమార్లు మోక్షజ్ఞ హీరో అవుతున్నాడంటూ బాలయ్య ప్రకటనలు చేశారు. ఏళ్లకు ఏళ్లు గడిచిపోతున్నాయి కానీ... కార్యరూపం దాల్చడం లేదు. 2022లో బాలకృష్ణ ఫ్యూచర్ ప్రాజెక్ట్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆదిత్య 369 చిత్రానికి సీక్వెల్ ఉంటుంది. ఆ చిత్రానికి నేను దర్శకత్వం వహిస్తా అన్నారు. ఈ క్రమంలో ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రంతో మోక్షజ్ఞను హీరోగా బాలయ్య లాంచ్ చేస్తున్నారనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. 2023 కూడా వచ్చింది, కానీ ఎలాంటి అప్డేట్ లేదు. 

తాజాగా ఒక వీడియో బాలయ్య అభిమానులను ఆకర్షించింది. ఈ క్రమంలో మోక్షజ్ఞ హీరోగా వచ్చేస్తున్నారంటూ సదరు వీడియో వైరల్ చేస్తున్నారు. మార్చి 2న తారకరత్న పెదకర్మ ఫిల్మ్ ఛాంబర్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులు, ఇండస్ట్రీ ప్రముఖులు హాజరయ్యారు. బాలయ్యతో వీరసింహారెడ్డి చిత్రం చేసిన గోపీచంద్ మలినేని కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మోక్షజ్ఞ ఆయనకు ఎదురుపడ్డారు. గోపీచంద్ మలినేని-మోక్షజ్ఞ మధ్య సంభాషణ చోటు చేసుకుంది. 

Scroll to load tweet…

దీని సంబంధించిన వీడియో వైరల్ చేస్తున్న బాలయ్య అభిమానులు, మోక్షజ్ఞ ఎంట్రీకి బీజం పడింది. గోపీచంద్-మోక్షజ్ఞ మధ్య ఫోన్ నెంబర్స్ కూడా ఎక్స్ఛేంజ్ అయ్యాయి. కాబట్టి ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అంటున్నారు. ఎలాంటి అధికారిక సమాచారం లేకున్నా... బాలయ్య అభిమానులు మాత్రం మోక్షజ్ఞ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మూవీ చేస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. కాగా బాలయ్యకు గోపీచంద్ మలినేని వీరసింహారెడ్డి రూపంలో హిట్ ఇచ్చాడు. ఆయన నెక్స్ట్ మూవీ కోసం హీరోలను వెతికే పనిలో ఉన్నారు. బాలయ్య ప్రస్తుతం దర్శకుడు అనిల్ రావిపూడితో మూవీ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ సెకండ్ షెడ్యూల్ కి సిద్ధమవుతుంది.