సారాంశం
ఇప్పటికే `హిట్` యూనివర్స్ నుంచి రెండు సినిమాలు వచ్చాయి. తొలి చిత్రంలో విశ్వక్ సేన్ నటించాడు. రెండో పార్ట్ లో అడవిశేష్ నటించాడు. మూడో భాగం(హిట్3)లో నాని నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాని ప్రకటించారు. తాజాగా `హిట్4`ని కూడా ప్లాన్ చేస్తున్నారట శైలేష్.
సినిమాటిక్ యూనివర్స్ కాన్సెప్ట్ లు ఇప్పుడు ట్రెండ్‌గా మారాయి. ఒక సినిమాతో మరో చిత్రానికి ముడిపెడుతూ సినిమాలు చేయడం ఈ కాన్సెప్ట్ ఉద్దేశ్యం. లోకేష్ కనగరాజ్ ప్రాపర్ సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేశారు. `ఖైదీ`, `విక్రమ్` చిత్రాలకు లింక్ సెట్ చేశాడు. దీన్నికి `లియో`ని ముడిపెట్టబోతున్నారు. దీంతోపాటు `విక్రమ్ 2`, `ఖైదీ 2` చిత్రాలను ప్లాన్ చేస్తున్నారు. అలాగే `కేజీఎఫ్`యూనివర్స్, తెలుగులో `హిట్` యూనివర్స్ రాబోతుంది. దర్శకుడు శైలేష్ కొలను దీన్ని సృష్టించారు.
ఇప్పటికే `హిట్` యూనివర్స్ నుంచి రెండు సినిమాలు వచ్చాయి. తొలి చిత్రంలో విశ్వక్ సేన్ నటించాడు. రెండో పార్ట్ లో అడవిశేష్ నటించాడు. మూడో భాగం(హిట్3)లో నాని నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాని ప్రకటించారు. తాజాగా `హిట్4`ని కూడా ప్లాన్ చేస్తున్నారట శైలేష్. దీనికి సంబంధించి ఓ మైండ్ బ్లోయింగ్ ప్లాన్ చేశాడు శైలేష్. నాల్గో పార్ట్ లో పెద్ద హీరోని తీసుకోబోతున్నారు. ఏకంగా టాలీవుడ్ సీనియర్ హీరోని ఆయన ఈ సిరీస్‌లోకి లాగుతుండటం ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఆయన ఎవరో కాదు, మన నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ. `హిట్4`ని బాలకృష్ణతో చేయాలని భావిస్తున్నారట శైలేష్ కొలను.
ఇప్పటికే బాలయ్యకి స్క్రిప్ట్ కూడా నెరేట్ చేశారు. ఇటీవలే కథ చెప్పగా బాలయ్య పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారట. అయితే దీనిపై దర్శకుడికి ఇంకా ఎలాంటి సమాధానం ఇవ్వలేదని తెలుస్తుంది. దీంతో వెయిటింగ్‌లో ఉన్నారు శైలేష్. ఇదిలా ఉంటే జూన్ 10న బాలకృష్ణ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన నటించబోతున్న కొత్త సినిమాల ప్రకటనలు రానున్నాయి. ప్రస్తుతం అనిల్ రావిపూడితో `ఎన్బీకే108` చిత్రంలో నటిస్తున్నారు బాలయ్య. ఈ సినిమా టైటిల్‌ని బర్త్ డే రోజు ప్రకటించనున్నారట. దీనికి `భగవంత్ లాల్ కేసరి` అనే టైటిల్‌ని ఖరారు చేసినట్టు సమాచారం.
ఆ తర్వాత బోయపాటి శ్రీనుతో సినిమా చేయనున్నారట బాలయ్య. ఈ సినిమా ప్రకటన కూడా రానుందట. మరోవైపు బాబీతోనూ ఓ సినిమా అనుకున్నారని సమాచారం. ఇప్పుడు శైలేష్ కొలను సినిమా తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో జూన్ 10న బాలయ్య కొత్త సినిమా ప్రకటనలన్నీ రానున్నాయని చెప్పొచ్చు. అందులో `హిట్4` ప్రకటన ఉంటుందా? లేదా? అనేది చూడాలి. లేకపోతే ఇక ఆ సినిమా లేనట్టే అని టాక్. మరి వస్తుందా? రాదా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం శైలేష్.. వెంకటేష్‌తో `సైంధవ్` సినిమా చేస్తున్నారు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న `ఎన్బీకే108` చిత్రంలో కాజల్ కథానాయికగా నటిస్తుంది. యంగ్ సెన్సేషన్ శ్రీలీల కీలక పాత్ర పోషిస్తుంది. తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలో బాలయ్య తెలంగాణ స్లాంగ్‌లో మాట్లాడతారని సమాచారం. మాస్,కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా దసరా కానుకగా విడుదల కాబోతుంది.ఇప్పటికే బాలయ్య సంక్రాంతికి `వీరసింహారెడ్డి`తో సక్సెస్ కొట్టాడు. దాన్ని ఈ సినిమాతో కంటిన్యూ చేస్తాడా? అనేది చూడాలి.