బాలయ్యను కొత్తగా చూపిస్తానంటున్నబాబీ, ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా..?
ప్రస్తుతం అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నబాలయ్య..నెక్ట్స్ బాబీతో సినిమా అనౌన్స్ చేశాడు.. ఓపెనింగ్ కూడా అయిపోయింది. ఇక ఈమూవీ గురించి బాలయ్య ఫ్యాన్స్ లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు నందమూరి బాలకృష్ణ. ఒక సినిమా కంప్లీట్ అయ్యే లోపు..మరో సినిమా స్టార్ట్ చేస్తూ..యంగ్ హీరోలకు కూడా షాక్ ఇస్తున్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో భగవంత్ కేసరి సినిమా చేస్తున్న బాలయ్య.. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే బాబీతో సినిమా కమిట్ అయ్యాడు..రీసెంట్ గా ఓపెనింగ్ కూడా చేసేశారు. అయితే ఈసినిమా గురించి రకరకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. బాలయ్యను బాబీ ఎలా చూపించబోతున్నాడు.. కథ ఎలా ఉంటుంది అన్న క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో ఉంది.
ఇక తాజాగా ఈ సినిమా గురించి వినిపిస్తున్న మాట ఏంటంటే..? బాలయ్య టైప్ యాక్షన్ డ్రామాగా కాకుండా.. ఈసినిమాను పక్కా ఫ్యామిలీ మూవీగా తెరకెక్కించబోతున్నారట టీమ్. ఫ్యామిలీ డ్రామాకు.. ఎమోషన్స్ ను ఆడ్ చేసి కథను రాసుకున్నాడట బాబీ. బాలయ్య అంటే యాక్షన్.. అన్నట్టు ఉంటుంది. అటువంటిది... ఈసారి కాస్త డిఫరెంట్ గా ట్రై చశారట టీమ్. ఈసినిమాలో యాక్షన్ కన్నా.. ఫ్యామిలీ ఎమోషన్సే ఎక్కువ ఉంటాయట.
పైగా బాలయ్య క్యారెక్టర్ కూడా చాలా కొత్తగా ఉంటుందట. అన్నట్టు పాలిటిక్స్ నేపథ్యంలో కూడా ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందట.దర్శకుడు బాబీ ఈ సినిమా కథలో పొలిటికల్ టచ్ కూడా ఇచ్చాడట. ఏది ఏమైనా రాజకీయ నేపథ్యంలో ఈ సినిమా వస్తే మాత్రం.. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి. ఇక్ ఈమధ్య బాలయ్య బాబు ఎక్కువగా డ్యూయల్ రోల్స్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాలో కూడా బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. ముఖ్యంగా సినిమాలో బాలయ్య ఓల్డ్ గెటప్ ఓ రేంజ్ లో ఉంటుందని టాక్. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ నాగవంశీ నిర్మిస్తున్నారు.