ముదురుతున్న వివాదం.. బాలకృష్ణ దిష్టి బొమ్మ దహనం, క్షమాపణలకు డిమాండ్
బాలయ్య వివాదం ముదిరి పాకాన పడుతుంది. అక్కినేని కుటుంబానికి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్.. ఇవి చాలవన్నట్టు.. అటు కాపునాడు సంఘాలుకూడా బాలయ్యపై కారాలు మిర్యాలు నూరుతున్నారు.

బాలయ్య వ్యాఖ్యల సెగలు గట్టిగా తగులుతున్నాయి. అక్కినేని పౌ ఆయన చేసిన వాఖ్యలు వివాదం అవుతున్నాయి. అక్కినేని అభిమానులు బాలయ్యపై మండిపడుతున్నారు. అక్కినేని కుటుంబానికి క్షమాపణలు చెప్పాల్సిందే అంటున్నారు. లేకుంటే పరినామాలు తీవ్రంగా ఉంటాయి అంటున్నారు అక్కినేని అభిమాన సంఘాలు. ఈక్రమంలోనే బాలయ్య దిస్టి బొమ్మను కూడా దహనం చేశారు అక్కినేని ఫ్యాన్స్.
అక్కినేని పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నెల్లూరు నరక్తి సెంటర్ లో ఏఎన్నార్ అభిమానులు ఆందోళనకు దిగారు. బాలకృష్ణ దిష్టిబొమ్మను దహనం చేశారు. అక్కినేని కుటుంబానికి బాలకృష్ణ క్షమాపణ చెప్పాలంటూ వారు డిమాండ్ చేశారు.మరోవైపు ఎల్లుండి నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభమవుతున్న నేపథ్యంలో బాలయ్య క్షమాపణ చెప్పకుండే లోకేష్ యాత్రను అడ్డుకుంటామని హెచ్చరించారు కాపు నేతలు. అక్కినేని తో పాటు ఎస్వీ రంగారావుపై కూడా బాలయ్య చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రంగారావును అన్నందకు కాపులు కోపంగా ఉన్నారు. ఆయన క్షమాపణలు చెప్పితీరాలని.. లేకపోతే.. ఊరుకునేది లేదు అన్నారు.
ఈరోజు సాయంత్రంలోపు బాలయ్య బహిరంగ క్షమాపణలు చెప్పాలని కాపునాడు నిన్న అల్టిమేటం ఇచ్చిన సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణకు కాపునాడు పెట్టిన డెడ్ లైన్ నేటి సాయంత్రంతో ముగియనుంది. ఎస్వీఆర్ పై ఆయన చేసిన వ్యాఖ్యలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పకుంటే లోకేష్ పాదయాత్రను అడ్డుకుంటామని హెచ్చరించారు. అయితే నందమూరి బాలకృష్ణ మాత్రం ఇప్పటి వరకూ క్షమాపణలు చెప్పలేదు. మరి తరువాతి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి ,
మరో వైపు బాలయ్య వాఖ్యలకు నిరసనగా ఈరోజు అక్కినేని అభిమానులు కూకటపల్లి అర్జున్ థియేటర్ దగ్గర ధర్నచేయబోతున్నారు. కాగా ఈ విషయంలో కింగ్ నాగార్జున స్పందించలేదు కాని.. ఆయన తనయులు.. నాగచైతన్య, అఖిల్ మాత్రం సోషల్ మీడియా వేధికగా స్పందించారు. నందమూరి తారకరామారావు, ఎస్వీ రంగారావు, అక్కినేని నాగేశ్వరావు లాంటి మహనీయులను అంటే..తమను తాము విమర్షించుకున్నట్టే అన్నట్టుగా బాలయ్యకు చురకలు అంటించారు. కాగా వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో బాలకృష్ణ ఏఎన్నార్, ఎస్వీ రంగారావులపై చేసిన వ్యాఖ్యలపై ఈ దుమారం అంతా రేగుతోంది. అటు కాపునాడు, ఇటు ఏఎన్నార్ ఫ్యాన్స్ బాలయ్యపై మండి పడుతున్నారు. మరి బాలకృష్ణ క్షమాపణలు చెపుతారా లేదా అనేది ఆసక్తి కరంగా మారింది.