భగవంత్ కేసరి కలెక్షన్స్... హిట్ కొట్టాలంటే ఇంకా ఎన్ని కోట్లు కావాలంటే!
భగవంత్ కేసరి ఫలితం బాలయ్య ఫ్యాన్స్ లో జోష్ నింపింది. ఈ చిత్ర వసూళ్లు నిలకడగా ఉన్నాయి. ఆరు రోజుల్లో భగవంత్ కేసరి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి...

దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన భగవంత్ కేసరి 6వ రోజు సాలిడ్ వసూళ్లు అందుకుంది. ఫస్ట్ డే అనంతరం బెస్ట్ వసూళ్లు దక్కినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. మంగళవారం భగవంత్ కేసరి రూ. 8 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ రాబట్టిందని సమాచారం. ఇక 6 రోజులకు భగవంత్ కేసరి నైజాం రూ.12.7 కోట్లు రాబట్టింది. సీడెడ్ లో రూ.10.9 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.3.8 కోట్లు వసూలు చేసింది. గుంటూరులో భగవంత్ కేసరి భారీ వసూళ్లు రాబట్టింది. అక్కడ రూ.5.1 కోట్లు వసూలు చేసింది.
కర్ణాటకలో రూ.3.8 కోట్లు, రెస్టాఫ్ ఇండియా రూ.0. 5 కోట్లు, ఓవర్సీస్ రూ.6 కోట్లు రాబట్టింది. వరల్డ్ వైడ్ రూ.51.8 కోట్లు రాబట్టింది. అయినా బ్రేక్ ఈవెన్ టార్గెట్ చేరుకోలేదు. ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు పరిశీలిస్తే ఇంకా భగవంత్ కేసరి సాలిడ్ వసూళ్ళు రాబట్టాల్సి ఉంది. నేటి నుండి పండగ సెలవలు ముగియడంతో అసలు పరీక్ష మొదలుకానుంది.
భగవంత్ కేసరి తెలుగు రాష్ట్రాల్లో రూ. 57 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. వరల్డ్ వైడ్ రూ. 69 కోట్లకు థియేట్రికల్ హక్కులు విక్రయించారు. రూ. 70 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. రూ. 71 కోట్లు వస్తే కానీ భగవంత్ కేసరి హిట్ టాక్ తెచ్చుకోదు. అయితే ట్రేడ్ వర్గాల లెక్కలకు నిర్మాతల పోస్టర్స్ కి తేడా ఉంది. నిర్మాతలు రిపోర్ట్ చేస్తున్న స్థాయిలో వసూళ్లు లేవని సమాచారం.
భగవంత్ కేసరి మూవీలో బాలయ్య రెండు డిఫరెంట్ రోల్స్ చేశారు. శ్రీలీల బాలయ్యకు కూతురు సమానమైన పాత్ర చేసింది. కాజల్ హీరోయిన్ గా చేసింది. షైన్ స్క్రీన్ బ్యానర్ లో తెరకెక్కించారు. థమన్ సంగీతం అందించారు. దసరా బరిలో నిలిచిన లియో, టైగర్ నాగేశ్వరరావు నెగిటివ్ టాక్ తెచ్చుకోవడం భగవంత్ కేసరికి ప్లస్ అయ్యింది.
ఏరియా వైజ్ భగవంత్ కేసరి 6 డేస్ కలెక్షన్స్
నైజాం - 12.7 కోట్లు
సీడెడ్ - 10.9 కోట్లు
ఉత్తరాంధ్ర - 3.8 కోట్లు
గుంటూరు - 5.1 కోట్లు
కృష్ణ - 2.6 కోట్లు
నెల్లూరు - 1.8 కోట్లు
తూర్పు - 2.4 కోట్లు
వెస్ట్ - 2.2 కోట్లు
కర్ణాటక - 3.8 కోట్లు
రెస్టాఫ్ ఇండియా - 0.5 కోట్లు
ఓవర్సీస్ - 6 కోట్లు
మొత్తం - 51.8 కోట్లు (జీఎస్టీతో కలిపి)