విజయవంతంగా సాగిన ఈ టాక్‌ షో ముగింపుకి చేరింది. రేపు(ఫిబ్రవరి 4)న విడుదల కాబోతున్న మహేష్‌ ఎపిసోడ్‌లో ఈ షో పూర్తవుతుంది.శుక్రవారం సాయంత్రం ఎనిమిది గంటలకు మహేష్‌ గెస్ట్ గా పాల్గొన్న పూర్తి ఎపిసోడ్‌ స్ట్రీమింగ్‌ కానుంది.

నందమూరి బాలకృష్ణలోని మరో యాంగిల్‌ని ఆవిష్కరించిన షో `అన్‌స్టాపబుల్‌విత్‌ఎన్బీకే`. `ఆహా` ఓటీటీలో ప్రసారమవుతున్న టాక్‌ షో ఇది. స్టార్స్ తో బాలయ్య చేసే చిట్‌చాట్‌ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుంది. సార్లకి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను రాబట్టారు బాలయ్య. జనరల్‌గా బాలకృష్ణ అంటే ఫైర్‌ మూడ్‌లో ఉంటారని, కోపం ఎక్కువ అనే టాక్‌ ఉంది. కానీ ఆయనలో చలాకీతనం కూడా ఉందని, ఆయన జోవియల్‌గానూ ఉంటారని తెలియజేసిన షో `అన్‌స్టాపబుల్`. విజయవంతంగా సాగిన ఈ టాక్‌ షో ముగింపుకి చేరింది. రేపు(ఫిబ్రవరి 4)న విడుదల కాబోతున్న మహేష్‌ ఎపిసోడ్‌లో ఈ షో పూర్తవుతుంది.

శుక్రవారం సాయంత్రం ఎనిమిది గంటలకు మహేష్‌ గెస్ట్ గా పాల్గొన్న పూర్తి ఎపిసోడ్‌ స్ట్రీమింగ్‌ కానుంది. అయితే ఇప్పటికే ఓ ప్రోమో విడుదలై ఆకట్టుకుంది. వైరల్‌ అయ్యింది. తాజాగా మరో ప్రోమోని రిలీజ్‌ చేశారు. ఇందులో బాలయ్య.. మహేష్‌ని ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. నిర్మొహమాటంగా అనేక రహస్యాలను మహేష్‌ని రాబట్టారు. తాజాగా ప్రోమోని చూస్తుంటే అర్థమవుతుంది. ఓ రకంగా మహేష్‌ని పిండేశారని చెప్పొచ్చు. దీంతో బాలయ్య మామూలోడు కాదు, ఏకంగా మహేష్‌తోనే అన్ని రహస్యాలను రాబట్టారని అంటున్నారు నెటిజన్లు. 

ఇక లేటెస్ట్ ప్రోమోని బట్టి మహేష్‌పై బాలయ్య పలు పంచ్‌లు వేశారు. మహేష్‌ని చూసి ఇంత యంగ్‌గా ఉన్నవేంటయ్య బాబు అని బాలయ్య చెప్పడంతో మహేష్‌ సిగ్గులు పోతూ నవ్వులు పూయించారు. ఆ తర్వాత మహేష్‌ నుంచి నా డైలాగ్‌ ఒకటి వినాలని ఉందని బాలయ్య కోరగా, మహేష్‌ అదిరిపోయే పంచ్‌ వేశారు. `మీ డైలాగ్‌ మీరు తప్ప ఇంకెవరూ చెప్పలేరు సర్‌` అని చెప్పడం బాలయ్యని ఆశ్చర్యపరుస్తుంది. ఆ తర్వాత చిన్నప్పుడు నువ్వు చాలా నాటీ కిడ్‌వని విన్నానని బాలయ్య అనడంతో మహేష్‌ విరగబడి నవ్వడం విశేషం. 

అంతేకాదు `చేసేవన్నీ చేస్తావ్‌.. చెప్పమంటే సిగ్గు పడావ`ని బాలయ్య అనగా, మహేష్‌ నవ్వాపుకోలేకపోయారు. ఇంతలో ఓ సీక్రెట్‌ని రాబట్టారు బాలయ్య. సినిమాల పరంగా మహేష్‌కి వచ్చిన గ్యాప్‌ విషయం గురించి ప్రశ్నించారు. స్టార్‌ నుంచి సూపర్‌ స్టార్‌ అయ్యావు, కానీ సడెన్‌గా మూడేళ్లు గ్యాప్‌ తీసుకున్నావ్‌. ఎందుకని అడగ్గా.. మహేష్‌ స్పందిస్తూ, ఆ మూడేళ్లు నన్ను నేను కరెక్ట్ చేసుకోవడానికి తీసుకున్నా. ఆ తర్వాత మళ్లీ తిరిగి ఆలోచించలేదని, అన్‌స్టాపబుల్‌గా దూసుకుపోతున్నట్టు చెప్పారు. ఇంతలో మరో బాణం వదిలారు బాలయ్య. `వెకేషన్‌ అని చెప్పి పెళ్లి చేసుకున్నావ్‌.. ఏంటి అంత సీక్రెట్‌ అన్ని ప్రశ్నించారు. దీనికి మహేష్‌ నవ్వుతూ బాలయ్య వైపు ఏంటిది అన్నట్టుగా ఎక్స్ ప్రెషన్‌ ఇవ్వడం విశేషం. అయితే దీనికి మహేష్‌ ఏం చెప్పారనేది ఆసక్తికరంగా మారింది. మరింత ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తుంది. 

YouTube video player

ఇదిలా ఉంటే మహేష్‌ కొత్త సినిమా గురువారం ప్రారంభమైంది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా, హారికా అండ్‌ హాసిని ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ(చిన్నబాబు)నిర్మిస్తున్నారు.