కేవలం  ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన  ఆనందయ్య కరోనా మందుపై తెలుగు సినీ నటుడు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తాజాగా  స్పందించారు. ఈ రోజు  దివంగత ఎన్టీఆర్ జయంతి పురస్కరించుకుని అంజలి ఘటించిన తర్వాత బాలకృష్ణ మాట్లాడుతూ ఈ టాపిక్ తెచ్చారు. ఆనందయ్య మందుపై తనదైన శైలిలో కామెంట్ చేశారు.

బాలయ్య మాట్లాడుతూ..“నాకు నమ్మకం ఉందయ్యా.. అభిమానం లేనిదే ఆరాధన లేదు.. ఆరాధన లేనిదే మతం లేదు. మతం లేనిదే మానవుడే లేడు. అలాగే ప్రతీది ఒక నమ్మకం.. నేను నమ్ముతాను తప్పకుండా… ఎందుకంటే, గొప్పగొప్ప వైద్యులున్నారు. క్రీస్తు పూర్వమే సుశంకుడనే వైద్యుడుండే వాడు.. ఆస్ట్రేలియా మెల్ బోర్న్ లో ఇవాళ్టికి కూడా రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జరీ లో ఆయన పేరుంది” అని బాలయ్య వ్యాఖ్యానించారు.

అలాగే స్వర్గీయ ఎన్టీఆర్ జీవితాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలని కోరాడు నందమూరి బాలక్రిష్ణ.   ఎన్టీఆర్ 98వ జయంతి సంధర్భంగా హైదరాబాద్లోకి ఘాట్వద్దకు కార్యకర్తలతో చేరుకుని నివాళులు అర్పించారు.  ఎన్టీఆర్ సినిమాలు చూసి స్పూర్తి పోందానని చెప్పారు. తెలుగు వారు గర్వపడేలా ఎన్టీఆర్ చరిత్రలో నిలిచిపోయాడని అన్నారు. ఆయన చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని కోరారు. 
 
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ అఖండ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఎన్టీఆర్ జయంతి మే 28న రిలీజ్ కావాల్సింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఏ మాత్రం లేవు. దీంతో ఈ సినిమాను సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది.