Asianet News TeluguAsianet News Telugu

రమ్య కృష్ణకు సభాముఖంగా సారీ చెప్పిన రాజమౌళి

  • చెన్నైలో ఘనంగా బాహుబలి2 ఆడియో వేడుక
  • ఆడియో వేడుక సందర్భంగా రమ్యకృష్ణకు సారీ చెప్పిన దర్శకుడు
  • శివగామి పాత్ర కోసం శ్రీదేవిని అడిగినందుకు సారీ చెప్పిన రాజమౌళి
bahubali director rajamouli says sorry to sivagami ramyakrishna

బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్ర ఎంతటి పేరొందిందో తెలిసిందే. ఆ పాత్రలో రమ్యకృష్ణ అభినయంతో అద్భుతంగా ఆకట్టుకుంది. అయితే ఆ పాత్ర కోసం ముందుగా రాజమౌళి... అతిలోక సుందరి శ్రీదేవిని సంప్రదించారట. శ్రీదేవితో పాటు మరికొందరు బాలీవుడ్‌ నటీమణులలో ఎవరో ఒకరి చేత ఈ రోల్‌ వేయిద్దామనుకున్నాడట రాజమౌళి.

 

బాహుబలి 2 తమిళ్ ఆడియో విడుదల సందర్భంగా రమ్యకృష్ణ ఎలా శివగామి అయ్యిందో చెప్పుకొచ్చాడు రాజమౌళి. నిజానికి ఈ పాత్ర కోసం శ్రీదేవి 6 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో చివరకు రమ్యకృష్ణను శివగామిగా ఖరారు చేశారు. ఇక రమ్యకృష్ణ నటన చూసిన తర్వాత... శ్రీదేవి ఆ పాత్ర చేసి ఉంటే ఈ రేంజీలో నటించేది కాదేమోనంటూ ఇప్పటికే పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ స్థానంలోకి రమ్యకృష్ణ ఎందుకు వచ్చిందన్న కారణం ఇప్పుడు తెలిసింది. శ్రీదేవి భారీగా రెమ్యునరేషన్‌ అడగడంతోనే... వెనకడుగు వేయటం జరిగిందని.. అది మంచిదే అయ్యిందని రాజమౌళి కూడా తర్వాత అనుకున్నాడట.

 

చెన్నైలో జరిగిన ఆడియో విడుదల కార్యక్రమంలో మాట్లాడిన రాజమౌళి.. ‘‘శివగామి' పాత్ర కోసం మొదట వేరేవారిని అనుకున్నాను. రమ్యకృష్ణగారు అందుబాటులో ఉన్నా.. వేరే వారి కోసం ప్రయత్నించా. అందుకు సిగ్గుపడుతున్నా. ఈ విషయంలో ఆమెకు సభాముఖంగా క్షమాపణ చెబుతున్నా. ఆవిడ అద్భుత నటనతో శివగామి పాత్రను పండించార'ని ప్రశంసించాడు రాజమౌళి.

Follow Us:
Download App:
  • android
  • ios