హృదయ కాలేయం సినిమాతో నెట్ ప్రపంచంలో  సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన కామెడీ నటుడు బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌ బాబు. సోషల్‌ మీడియా ప్రమోషన్‌లో సరికొత్త ట్రెండ్ సృష్టించిన సంపూ, ఆ తరువాత ఆ  స్థాయిలో మళ్లీ ఆకట్టుకోలేకపోయాడు. హృదయకాలేయం తర్వాత  హీరోగా నటించిన సింగం 123తో పాటు,వివిధ సినిమాల్లో చేసిన కామెడీ రోల్స్‌ కూడా పెద్దగా క్లిక్‌ కాకపోవటంతో ఆఫర్స్ గణనీయంగా తగ్గిపోయాయి. 

అయితే సంపూ మంచి ఫాంలో ఉండగానే కొబ్బరి మట్ట పేరుతో ఓ సినిమాను ఎనౌన్స్ చేశారు. పోస్టర్‌లు, టీజర్‌లతో బాగానే హడావిడి జరిగింది. కానీ తరువాత వెంటనే సినిమా పూర్తి చేసి రిలీజ్ కు పెట్టకపోవటంతో ఆ బజ్ మెల్లిగా మాయమైంది. ఆ సినిమా గురించి ఆడియన్స్‌ మర్చిపోయారు. మధ్యమధ్యలో  పోస్టర్స్‌ రిలీజ్ చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్‌కు రెడీ రిలీజ్ చేశాడు సం‍పూ. ఆగస్ట్ 10 న సినిమా రిలీజ్ అవుతుందని ప్రకటించారు. 

అయితే అదే తేదీన మన్మధుడు 2, కథనం రిలీజ్ లు ఉన్నాయి. అలాగే ఈ సినిమా వారం పూర్తయ్యి మళ్లీ శుక్రవారం వచ్చేసరికి అడవి శేషు ఎవరు, శర్వానంద్ రంగస్దలం చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. వీటిన్నిటి మధ్యనా ఈ సినిమా రిలీజ్ చేస్తూండటంతో సంపూ అభిమానులు కంగారుపడుతున్నారు. మంచి కంటెంట్, నవ్వుకునే సినిమా అయినా వీటి మధ్యన నలిగిపోతుందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

రూపక్‌ రొనాల్డ్ దర్శకత్వంలో స్టీవెన్‌ శంకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో సంపూర్ణేష్‌ బాబు మూడు విభిన్న పాత్రల్లో అలరించనున్నాడు. మరి ఈ సినిమా బర్నింగ్‌ స్టార్‌కు తిరిగి పూర్వ వైభవం తీసుకువస్తుందేమో చూడాలి.!