విజువల్‌ వండర్‌ `అవతార్‌` లవర్స్ కి చేదు వార్త. మిగిలిన మూడు భాగాల రిలీజ్‌ డేట్స్ లో భారీగా మార్పులు చేశారు. అవి మరింత లేట్‌గా రిలీజ్‌ కాబోతున్నాయి. 

`అవతార్‌`.. ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతిపెద్ద సినిమాగా దీన్ని భావిస్తుంటారు. బడ్జెట్‌ వైజ్ గా, కలెక్షన్ల పరంగా, ఎక్కువ ఆదరణ పొందిన సినిమా పరంగానూ `అవతార్‌` నిలిచింది. ప్రపంచ రికార్డులు కొల్లగొట్టింది. విజువల్‌ వండర్‌గా భావించే ఈ సినిమాని చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరు ఇష్టపడటం విశేషం. హాలీవుడ్‌ దర్శకుడు జేమ్స్ కామెరాన్‌ మదిలో పుట్టిన ఈ ఐడియా 20వ సెంచరీ ఫాక్స్ ద్వారా నిజమైంది. 2009లో మొదట `అవతార్‌` సిరీస్‌ ప్రారంభమైంది. మొదటి భాగం సంచలన విజయం సాధించి ప్రపంచ రికార్డులు సృష్టించింది. దీంతో ఈ సిరీస్‌లో వచ్చే సినిమాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

గతేడాది డిసెంబర్‌లో `అవతార్‌ 2` రిలీజ్‌ అయ్యింది. అయితే మొదటి సినిమా రేంజ్‌లో సక్సెస్‌ కాలేకపోయింది. విజువల్స్ గొప్పగా ఉన్నా, అందులో ఎమోషన్స్ క్యారీ కాలేదు. మనవైన ఫీలింగ్‌ మిస్‌ అయ్యింది. దీంతో సినిమాకి మిశ్రమ స్పందన లభించింది. కలెక్షన్ల పరంగానూ యావరేజ్‌గానే నిలిచింది. మొదటి సినిమా 2.93 బిలియన్‌ డాలర్లు(ఇప్పటి ఇండియన్‌ రూపాయి ప్రకారం 24వేల కోట్లు) వసూలు చేస్తే, రెండో భాగం 2.3(19వేల కోట్లు) వద్దే ఆగిపోయింది. దీంతో ఐదు భాగాలుగా రాబోతున్న `అవతార్‌`కి సంబంధించి మిగిలిన మూడు భాగాలపై ఆశలు పెట్టుకున్నారు మేకర్స్. ఆడియెన్స్ సైతం వాటికోసం వెయిట్‌ చేస్తున్నారు. 

గతేడాది `అవతార్‌ 3, 4, 5` పార్ట్ ల రిలీజ్‌ డేట్ లు ప్రకటించింది నిర్మాణ సంస్థ. మూడో భాగం వచ్చే ఏడాది డిసెంబర్‌ 20న రిలీజ్‌ చేయబోతున్నట్టు ప్రకటించింది. దీంతోపాటు నాల్గో భాగం 2026 డిసెంబర్‌ 18, ఐదో భాగం 2028 డిసెంబర్‌ 22న అనుకున్నారు. ప్రతి రెండేళ్లకి ఒకసారి ఒక్కో పార్ట్ ని ఆడియెన్స్ ముందుకు తీసుకురావాలని జేమ్స్ కామెరాన్‌, 20వ సెంచరీ ఫాక్స్ భావించారు. కానీ తాజాగా `అవతార్‌` ప్రియులకు బ్యాడ్‌ న్యూస్‌ చెప్పింది యూనిట్‌. మిగిలిన మూడు పార్ట్ లు భారీగా డిలే అవుతున్నట్టు వెల్లడించింది. రిలీజ్‌ డేట్స్ లో భారీగా మార్పులు చేశారు. 

Scroll to load tweet…

`అవతార్‌ 3`ని 2025లో విడుదల చేయబోతున్నట్టు వెల్లడించింది. 2025 డిసెంబర్‌ 19న రిలీజ్‌ చేయబోతున్నట్టు తెలిపింది. మరోవైపు నాల్గో భాగాన్ని 2029 డిసెంబర్‌ 21, ఐదో భాగాన్ని 2031 డిసెంబర్‌ 19న విడుదల చేయబోతున్నారు. దీంతో మిగిలిన మూడు పార్ట్ లు ఐదేళ్ల డిలేతో రాబోతున్నాయి. అయితే రెండో సినిమాపై వచ్చిన విమర్శల కారణంగానే, మరింత వర్క్ చేయాల్సి ఉంటుందనే ఉద్దేశ్యంతో రిలీజ్‌ డేట్‌లు మార్చినట్టు తెలుస్తుంది. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఈ వార్త మాత్రం `అవతార్‌` ప్రియులను తీవ్ర నిరాశకు గురి చేస్తుందని చెప్పొచ్చు.