`సలార్‌` టీమ్‌ ఇచ్చిన షాక్‌తో ఆశలన్నీ `ఆదిపురుష్‌` ఫస్ట్ లుక్‌పై పెట్టుకున్నారు డార్లింగ్‌ ఫ్యాన్స్. కానీ దర్శకుడు ఓం రౌత్‌ భారీ షాకిచ్చాడు. పుండుమీద కారం చల్లినంత పని చేశాడు.

పండగలు, ప్రత్యేక రోజులు వచ్చాకంటే సినిమాల కొత్త పోస్టర్లు, సర్‌ప్రైజ్‌లు, అప్డేట్లు ఇస్తుంటారు మేకర్స్. ఏ స్టార్‌ హీరో సినిమా నుంచైనా ఇలాంటి గిఫ్ట్ లు జనరల్‌గా వస్తుంటాయి. కానీ ప్రభాస్‌ సినిమా అప్డేట్ల కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. ఊరించి ఊరించి ఉసూరుమనిస్తుంటారు. `రాధేశ్యామ్‌` సినిమా నుంచి ఇలాంటి నిరాశే ప్రభాస్‌ ఫ్యాన్స్ కి ఎదురవుతుంది. `రాధేశ్యామ్‌` సినిమా సమయంలో ఏకంగా ఓ అభిమాని అప్‌డేట్‌ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని లెటర్‌ రాసిన పరిస్థితి ఎదురయ్యింది. 

ఇప్పుడు శ్రీరామ నవమి సందర్భంగా షాక్‌ల మీద షాక్‌లు తగిలాయి. `సలార్‌` అప్‌డేట్‌వస్తుందని ఆశపడ్డారు డార్లింగ్‌ ఫ్యాన్స్. `కేజీఎఫ్‌ 2` సినిమాతోపాటు థియేటర్‌లో `సలార్‌` ఫస్ట్ గ్లింప్స్ వస్తుందని ఎంతో ఆశతో గత రెండు మూడు రోజులుగా సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ చేశారు. తీరా అలాంటిదేమి లేదని, `కేజీఎఫ్‌ 2`తో ఎలాంటి గ్లింప్స్ ఇవ్వడం లేదని వెల్లడించింది యూనిట్‌. దీంతో షాక్‌తినడం ప్రభాస్‌ ఫ్యాన్స్‌ వంతయ్యింది. 

ఈ షాక్‌తోనూ తీవ్ర డిజప్పాయింట్‌ అయిన అభిమానులకు `ఆదిపురుష్‌` డైరెక్టర్‌ మరో షాకిచ్చాడు. `ఆదిపురుష్‌` నుంచి కూడా ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు. కేవలం అభిమానులు డిజైన్‌ చేసిన ప్రభాస్‌ పోస్టర్లని ఓ వీడియో రూపంలో చేసి విడుదల చేశారు. శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. అయితే శ్రీరామనవమి పండుగ సందర్భంగా `ఆదిపురుష్‌` చిత్రంలో ప్రభాస్‌ ఫస్ట్ లుక్‌ విడుదల చేయబోతున్నారని గత పది రోజులుగా వార్తలు గుప్పుమన్నాయి. ఫ్యాన్స్ కూడా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. రాముడిగా ప్రభాస్‌ ఎలా ఉంటారో చూడాలని తహతహలాడుతూ ఉన్నారు. 

Scroll to load tweet…

`సలార్‌` టీమ్‌ ఇచ్చిన షాక్‌తో ఆశలన్నీ `ఆదిపురుష్‌` ఫస్ట్ లుక్‌పై పెట్టుకున్నారు డార్లింగ్‌ ఫ్యాన్స్. కానీ దర్శకుడు ఓం రౌత్‌ భారీ షాకిచ్చాడు. పుండుమీద కారం చల్లినట్టు చేశాడు. దీంతో వరుస షాక్‌లు ఎదురు కావడంతో తీవ్ర ఆవేశానికి గురవుతున్నారు ప్రభాస్‌ ఫ్యాన్స్. ఓం రౌత్‌ని ట్రోల్స్ చేస్తున్నారు. నెట్టింట ఆయనపై కామెంట్లు చేస్తూ తమ అసంతృప్తిని, నిరాశని వెల్లడిస్తున్నారు. కనీసం ఎప్పుడు అప్‌డేట్‌ ఇస్తారో చెప్పండి అంటూ బ్రతిమాలుకుంటున్నారు. ఇది చూసిన నెటిజన్లు పాపం ప్రభాస్‌ అభిమానులకు వచ్చిన పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కోరుకుంటున్నారు.