..ఈ మథ్యకాలంలో వచ్చిన సినిమాలు అన్నిటిలో  బాస్ రీ ఎంట్రీ తర్వాత  మోస్ట్ గ్లామరస్ గా కనిపించిన సినిమా భోళా శంకర్ . దాన్ని కూడా మనం నిలబెట్టుకోలేకపోయాం 


'బేబి' ప్రొడ్యూసర్  SKN మెగా వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా చిరంజీవి అంటే ఆయన కు చాలా ఇష్టం. ఆ విషయం చాలా సార్లు చెప్పారు. రీసెంట్ గా ఆయన ప్రొడ్యూస్ చేసిన బేబిని కూడా  చిరంజీవి చూసి మెచ్చుకున్నారు.  ఇక చిరంజీవి పుట్టిన రోజు సెలబ్రేషన్స్ లో SKN ఓ అభిమానిగా మాట్లాడారు. ఆయన భోళా శంకర్ చిత్రం డిజాస్టర్ అవ్వటానికి మెగా ఫ్యాన్స్ కూడా ఓ కారణం అని చెప్పుకొచ్చారు. ఆయన ఏమన్నారంటే..

         SKN మాట్లాడుతూ...ఈ మథ్యకాలంలో వచ్చిన సినిమాలు అన్నిటిలో  బాస్ రీ ఎంట్రీ తర్వాత  మోస్ట్ గ్లామరస్ గా కనిపించిన సినిమా భోళా శంకర్ . దాన్ని కూడా మనం నిలబెట్టుకోలేకపోయాం అంటే ఫస్ట్ రీజన్  మనమే.  ఎందుకంటే మనం వేరే వ్యక్తుల వలలో పడిపోతాం.  ఎవడో చెప్తాడు బాస్ రీమేక్ చేయాలా స్టైయిట్  సినిమా చేయాలా... ఎలాంటి సినిమా చేయాలని ఎవడో చెప్తే మనం నమ్మడం ఏంటి....ఎలాంటి  సినిమా చేయాలో బాస్  కి  తెలుసు. ఆయన కు సినిమా అంటే అమ్మకం కాదు నమ్మకం.  ఒక మోకాలికి ఆపరేషన్ చేయించుకొని స్టెప్స్ వేస్తున్నారు.    ఆయన సంపాదించిన సంపాదన ఎంత ఆయన సంపాదించిన కీర్తి ఎంత.. అయినా సరే ఆయన మనం అందరి కోసం కష్టపడుతున్నారు.మన మెగా ఫ్యాన్స్ కలిసి ఉండాలి అంటూ చాలా ఉద్వేగంగా చెప్పుకొచ్చారు SKN.

           ఇక మెగాస్టార్ చిరంజీవి న‌టించిన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `భోళా శంక‌ర్‌` . రెండు వారాల క్రితం  ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో ఏకె ఎంట‌ర్ టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అనిల్ సుంక‌ర‌, కె.ఎస్‌. రామారావు సంయుక్తంగా నిర్మించారు. ట్రైలర్, టీజర్ లతో ప్రేక్ష‌కుల్లో అంచ‌నాల్ని రేకెత్తించిన `భోళా శంక‌ర్‌`  ఆ స్దాయిలో వర్కవుట్ కాలేదు. త‌మ‌న్నా హీరోయిన్‌, కీర్తి స‌రేష్ సిస్ట‌ర్‌గా న‌టించిన ఈ సిస్ట‌ర్ సెంటిమెంట్ యాక్ష‌న్ డ్రామా ఫ‌స్ట్ డే, ఫ‌స్ట్ షో నుంచే డివైడ్ టాక్ ని ద‌క్కించుకుని షాకిచ్చింది. చిరు మార్క్ లేదని అభిమానులు సైతం అన్నారు.