ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీకి యూత్ బాగా కనెక్ట్ అవ్వడంతో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా ఆనంద్, వైష్ణవిల నటనకు అడియెన్స్ ఫిదా అయిపోయారు. 


 ప్రస్తుతం థియేటర్లలో హై సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న చిత్రం బేబీ'(Baby) ఆనంద్ దేవరకొండ(Anand Devarakonda), వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ లీడ్ రోల్స్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ ముందుకు వెళ్తోంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీకి యూత్ బాగా కనెక్ట్ అవ్వడంతో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా ఆనంద్, వైష్ణవిల నటనకు అడియెన్స్ ఫిదా అయిపోవుతున్నారు. దర్శకుడు రాసిన స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కు ఓ రేంజిలో రెస్పాన్స్ వస్తోంది. ఈచిత్రంపై అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా వంటి స్టార్ నటులు ప్రశంసలు వర్షం కురిపించారు. ఈ నేపధ్యంలో బేబి దర్శకుడు సాయి రాజేష్ చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. 

Scroll to load tweet…

ఆనంద్‌కు వైష్ణవి గురించి హర్ష నిజం చెప్పే సీన్లో.. ఎలాంటి డీటీఎస్ మిక్సింగ్ వద్దని, అలా సైలెన్స్‌గా ఉంటేనే ప్రేక్షకులు ఫీల్ అవుతారని అన్నారు.. కానీ ఆ సీన్‌లో ప్రేక్షకులు అందరూ కూడా ఆనంద్‌కు హ్యాపీ బర్త్ డే అని చెబుతూ అరుస్తున్నారట... అంత పెయిన్ ఫుల్ సీన్‌లోనూ ప్రేక్షకులు అలా చేస్తున్నారు.. థూ నా బతుకు అంటూ సాయి రాజేష్ ట్వీట్ వేశాడు.
ఆ ట్వీట్ మీద నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఆనంద్ అయితే పగలబడి నవ్వుతున్న ఎమోజీని షేర్ చేశాడు. కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు సినిమాలా మారిపోయిందని కామెంట్లు చేస్తున్నారు. సీరియస్‌గా తీస్తే సిల్లీగా మారిందని ట్వీట్లు పెడుతున్నారు.

అలాగే బేబి సినిమాలో హీరోయిన్‌ను హీరో బూతులు తిడుతుంటే.. అందరూ సీరియస్‌గా చూస్తారని అనుకున్నాడట. కానీ అందరూ అదే పదంతో థియేటర్లో గోల గోల చేసి హీరోయిన్ పాత్రను తిడుతున్నారు. అలా ఆ సీన్ చూసి సాయి రాజేష్ కూడా షాక్ అయ్యానని అంటున్నారు. ఇదేంటి జనాలు ఈ సీన్‌కు ఇలా అరుస్తున్నారు అని అనుకున్నాడట. ఇక విరాజ్, వైష్ణవిల కలయిక సన్నివేశానికి సంబంధించిన ఓ షాట్‌ను అనవసరంగా పెట్టానని, దాని వల్ల ఆ సీన్ అర్థమే మారిపోయిందంటూ సాయి రాజేష్ తాను చేసిన తప్పులను ఒప్పుకున్నాడు.

ఇక ఈ బ్లాక్ బస్టర్ మూవీకి సాయిరాజేష్ దర్శకత్వం వహించగా.. SKN నిర్మించారు. జూలై 14న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. విడుదలకు ముందే ఈ మూవీ సాంగ్స్, టీజర్, ట్రైలర్ తో మంచి బజ్ క్రియేట్ చేసింది. కల్ట్ క్లాసిక్‌ అనిపించుకున్న బేబీ మూవీకి విజయ్ బుల్గానిన్ ఇచ్చిన సంగీతం ప్రాణం పోసింది.