Asianet News TeluguAsianet News Telugu

23 ఏళ్ల యువతితో నటుడు బబ్లూ పృథ్వీరాజ్ రహస్య వివాహం ?.. ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా..

నటుడు పృథ్వీరాజ్ 90వ దశకం నుంచి తెలుగు, తమిళ భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. అనేక చిత్రాల్లో పృథ్వీరాజ్ కీలక పాత్రల్లో నటించారు. తెలుగులో ఎక్కువగా పృథ్వీ ఫ్యామిలీ కథా చిత్రాల్లో నటించారు.

Babloo Prithiveeraj second marriage with Malaysian girl
Author
First Published Oct 21, 2022, 5:37 PM IST

నటుడు పృథ్వీరాజ్ 90వ దశకం నుంచి తెలుగు, తమిళ భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. అనేక చిత్రాల్లో పృథ్వీరాజ్ కీలక పాత్రల్లో నటించారు. తెలుగులో ఎక్కువగా పృథ్వీ ఫ్యామిలీ కథా చిత్రాల్లో నటించారు. దీనితో తెలుగు ప్రేక్షకులకు పృథ్వీ సుపరిచయం.

పెళ్లి, పెళ్లి పందిరి, సమరసింహారెడ్డి, సంతోషం, దేవుళ్ళు, నువ్వునాకు నచ్చావ్ ఇలా అనేక చిత్రాల్లో పృథ్వీ నటించారు. తాజాగా పృథ్వీ గురించి షాకింగ్ న్యూస్ వైరల్ గా మారింది. ప్రస్తుతం పృథ్వీరాజ్ వయసు 56 ఏళ్ళు. ఈ వయసులో పృథ్వీ 23 ఏళ్ల యువతిని రహస్య వివాహం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

పృథ్వీరాజ్ తన మొదటి భార్య బీనాని 1994లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు సంతానం. అతడికి ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా కొంతకాలంగా బీనా, పృథ్వీరాజ్ వేర్వేరుగా నివసిస్తున్నట్లు తెలుస్తోంది. విభేదాల కారణంగా వీరిద్దరూ విడిపోయారని టాక్. 

ఈ క్రమంలో పృథ్వీరాజ్ మలేషియాకి చెందిన 23 ఏళ్ల అమ్మాయిని వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. పృథ్వీ కంటే ఆ యువతి దాదాపు 33 ఏళ్ళు వయసులో చిన్న అని తెలుస్తోంది. వయసు ఆరుపదుల సమీపిస్తున్న తరుణంలో పృథ్వీ రాజ్ సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. 

Follow Us:
Download App:
  • android
  • ios