Asianet News TeluguAsianet News Telugu

పెళ్లై ఏడాది కాలేదు.. భార్యకు డివోర్స్ ఇవ్వబోతున్న ‘యానిమల్’ నటుడు బబ్లూ పృథ్వీరాజ్.! కారణం ఇదేనా

సీనియర్ నటుడు బబ్లూ పృథ్వీరాజ్ తాజాగా ‘యానిమల్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా తన పెర్ఫామెన్స్ కు ఆడియెన్స్ మెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన భార్యకూ డివోర్స్ ఇవ్వబోతున్నట్టు షాకింగ్ న్యూస్ వైరల్ గా మారింది. 
 

Babloo Prithiveeraj Divorce his Second Wife Rukmini Sheetal NSK
Author
First Published Dec 1, 2023, 5:41 PM IST

టాలెంటెడ్ అండ్ సీనియర్ నటుడు బబ్లూ పృథ్వీరాజ్ (Babloo Prithiveeraj) చైల్డ్ ఆర్టిస్ గానే తన కెరీర్ ను ప్రారంభించారు. 80వ దశకం నుంచి నటుడిగా సినిమాలు చేస్తూ వచ్చారు. తొలుత తమిళం, మలయాళంలో వరుస పెట్టి మూవీస్ చేశారు. అలాగే తెలుగులోనూ గుర్తుండిపోయే సినిమాల్లో నటించారు. ‘పెళ్లి’ అనే చిత్రంలో విలన్ పాత్రకు ఏకంగా  నంది అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఆ సినిమా తర్వాత టాలీవుడ్ లోనే  వరుసగా సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ‘పెళ్లి పందిరి’, ‘పెళ్లాడి చూపిస్తా’, ‘ధీర్ఘ సుమంగలి భవ’, ‘సమర సింహా రెడ్డి’, ‘శ్రీమతి వెళ్లోస్తా’, ‘దేవుళ్లు’, ‘సంతోషం’; ‘చెన్నకేశవరెడ్డి’ వంటి చాలా సినిమాల్లో నటించారు. సపోర్టింగ్ రోల్స్ తో ఎంతగానో అలరించారు. ప్రేక్షకుల్లో స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు.

ఇక ఆయన పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. పృథ్వీరాజ్ 1994లో బీనాను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆ తర్వాత ఏడాదికే కొడుకు అహెద్ మోహన్ జబ్బర్ జన్మించారు. కానీ నకొన్ని కారణాల వల్ల 2022 నవంబర్ లో డివోర్స్ తీసుకున్నారు. అంతకు ముందే వీరు మనస్పార్థాలతో ఆరేళ్లుగా సెపరేట్ గా ఉంటున్నారు. మొదటి భార్యకు డివోర్స్  ఇచ్చిన వెంటనే అదే ఏడాది రుక్మిణి శీతల్ (Rukmini Sheetal)ను పెళ్లి చేసుకున్నారు. ఆమె వయస్సులో తనకంటే 33 ఏళ్లు చిన్న అని తెలుస్తోంది. ఏదేమైనా గతేడాది వీరద్దరూ పెళ్లి చేసుకున్నారు. పృథ్వీరాజ్ కు ఇది రెండో వివాహం కావడం విశేషం. 

ఇదిలా ఉంటే.. తాజాగా బబ్లూ పృథ్వీరాజ్ రెండో భార్యకూ డివోర్స్ ఇవ్వబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రధాన కారణాలు ఏంటనేది స్పష్టంగా తెలియడం లేదు. కానీ రుక్మిణి శీతల్ తన అఫిషీయల్ అకౌంట్ నుంచి పృథ్వీరాజ్ తనకు ప్రపోజ్ చేసిన వీడియోలను డిలీట్ చేయడంతోనే రూమర్లు పుట్టుకొచ్చాయని అంటున్నారు. దాన్నే ప్రధాన కారణంగా చెబుతూ వీరి మధ్య మనస్పార్థాలు ఉన్నాయని తెలుపుతున్నారు. దీంతో ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. పృథ్వీరాజ్ స్పందిస్తే గానీ క్లారిటీ వచ్చేలా లేదు. 

అయితే, కొద్దికాలం సినిమాలకు దూరంగా ఉన్న పృథ్వీరాజ్ గతేడాది నుంచి వరుసగా అలరిస్తూ వస్తున్నారు. 2022లో ఊర్వశీవో రాక్షసివో, అలాగే రీసెంట్ గా ‘స్కంద’ చిత్రంలోనూ కీలక పాత్రలో మెరిశారు. ఇక తాజాగా బాలీవుడ్ యాక్షన్ ఫిల్మ్ ‘యానిమల్’ (Animal)తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సందీప్ రెడ్డి వంగ - రన్బీర్ కపూర్ కాంబోలోని ఈ చిత్రంలో పృథ్వీరాజ్ కీలక పాత్రలో నటించారు. అలాగే రీసెంట్ గా ‘దయా’ అనే వెబ్ సిరీస్ తోనూ అలరించారు. పలు టీవీ షోల్లోనూ మెరుస్తూ ఆకట్టుకుంటున్నారు. మొత్తానికి ప్రస్తుతం అన్నీ ప్లాట్ ఫామ్స్ ల్లో కనిపిస్తూ అలరిస్తున్నారు.  

 

Follow Us:
Download App:
  • android
  • ios