తాజాగా ఆయన ట్వీట్ చేసారంటూ ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆయన ఎక్కౌంట్ లో ఆ ట్వీట్ కనపడటం లేదు. 


బాహుబ‌లి వంటి సూపర్ హిట్ చిత్రం అందించిన నిర్మాత శోభుయార్ల‌గ‌డ్డ (Shobu Yarlagadda). బాహుబ‌లి సిరీస్ రికార్డుల మోత మోగించి ఇప్పటికీ గుర్తుండి పోయేలా చేసింది. ఎంత‌లా అంటే సినిమా రికార్డుల గురించి మాట్లాడుకోవాలంటే..బాహుబ‌లి రికార్డులు, నాన్ బాహుబ‌లి రికార్డులు అనేంత‌గా. ఇప్ప‌టివ‌ర‌కు కూడా అంద‌రూ ఇలానే డిస్క‌ష‌న్స్ చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో శోభు యార్లగడ్డ మాటకు ఉండే విలువ వేరు. ఆయన ఆచి,తూచి మాట్లాడుతూంటారు. ట్వీట్ చేస్తూంటారు. తాజాగా ఆయన ట్వీట్ చేసారంటూ ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆయన ఎక్కౌంట్ లో ఆ ట్వీట్ కనపడటం లేదు. అసలు ట్వీట్ చేయలేదా..లేక చేసి డిలేట్ చేసేసారా అనేది క్వచ్చిన్ మార్క్. ఇంతకీ ఆ ట్వీట్ లో ఏముంది అంటే..

“సక్సెస్ ని తలకెక్కనివ్వకూడదు. దాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి! ఇటీవలే మంచి హిట్ అందుకున్న ఒక కొత్త నటుడు .ఒక డెబ్యూ డైరెక్టర్ స్క్రిప్ట్ చెప్పడానికి వెళ్ళినప్పుడు కనీస గౌరవం చూపలేదు! ఈ వైఖరి అతని కెరీర్‌ను బిల్డ్ చేయటంలో సహాయపడదని అతను త్వరగానే గ్రహిస్తాడని నేను ఆశిస్తున్నాను! ”, అని శోభు ట్వీట్ చేసారంటూ ఈ పై ట్వీట్ వైరల్ అవుతోంది. 

ఈ ట్వీట్ చూడగానే చాలా మందికి విశ్వక్సేన్, బేబి చిత్రం దర్శకుడు సాయి రాజేష్ కు మధ్య జరిగిన వివాదం గుర్తు వచ్చింది. అయితే విశ్వక్సేన్ మాత్రం కొత్త నటుడు కాదు అంటున్నారు. మరి ఎవరై ఉండవచ్చు అనేది ఎవరికీ అర్దం కాలేదు. అయితే అసలు ఈ ట్వీట్ ఆయన ఎక్కౌంట్ లో కనపడకపోవటంతో అసలు ఆయన వేసిందేనా కాదా అనే సందేహమూ చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.