అవినాష్‌ ఈ వారం ఎలిమినేషన్‌ నుంచి గట్టేక్కాడు. ఫ్రీ ఎవిక్షన్‌ పాస్‌ లేకపోయింటే తాను ఎలిమినేట్‌ అయ్యేవాడు. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఎలిమినేషన్‌ ప్రక్రియలో అవినాష్‌, అరియానా మిగిలి ఉండగా, ఇద్దరిలో అవినాష్‌ ఎలిమినేషన్‌ అయినట్టుగా వచ్చింది. అయితే అందుకు ముందే అవినాష్‌ ఈ పాస్‌ని తాను వాడుకుంటున్నట్టు తెలిపాడు. ఇది వచ్చే వారం వాడుకోవచ్చని, లేదంటే అరియానాకి కూడా ఇచ్చే అవకాశం ఉందని నాగ్‌ చెప్పినా.. అరియానా, సభ్యుల సలహా మేరకు ఈ పాస్‌ని వాడుకుని సేవ్‌ అయ్యాడు. 

ఈ సందర్భంగా అవినాష్‌ ఎమోషనల్‌ అయ్యాడు. తాను ప్రేక్షకుల దృష్టిలో ఎలిమినేట్‌ అయ్యాయనని, తాను ఉండాలో, వెళ్ళిపోవాలో తెలియడం లేదన్నాడు. ఈ సందర్భంగా నాగార్జున స్పందిస్తూ ఇక్కడి వరకు రావడం గ్రేట్ అని, గత వారాల్లో నీ స్థాయి బాగా పెరిగిందని చెప్పాడు. ప్రేక్షకుల వల్లే ఇక్కడ ఉన్నావని, సింపతి పక్కన పెట్టి బాగా ఆడు అని చెప్పారు. 

ఇక సుదీప్‌ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని కొన్ని ప్రశ్నలు అడగా సభ్యులు తమదైన స్టయిల్‌లో సమాధానాలు చెప్పారు. అవినాష్‌ని హౌజ్‌లో ఉన్న అమ్మాయిల్లో డేట్‌ వెళ్లడం, పెళ్ళి చేసుకోవడం, చంపడం చేయాల్సి వస్తే ఎవరిని ఏం చేస్తావని సుదీప్‌ అడగ్గా, మోనాల్‌తో డేట్‌కి వెళ్తానని, హారికని పెళ్ళిచేసుకుంటానని, అరియానా చంపేస్తానని తెలిపాడు. హారిక తాను ఒప్పుకోనని చెప్పడం నవ్వులు పూయించింది. 

ఇక అరియానాని సుదీప్‌ అడుగుతూ, అవినాష్‌తో కలిసి నిద్ర లేవాల్సి వస్తే ఏం చేస్తావమని ప్రశ్నించగా, అసలు ఆయనతో కలిసి నిద్రలేవని, అసలు ఆ రోజే నిద్రలేవనని, ఇంకా  చెప్పాలంటే అలాంటి రాత్రినే నాకు వద్దని స్పష్టం చేసింది.