Asianet News TeluguAsianet News Telugu

అరియనా ఎక్కడ అని అడుగుతున్నారు... ముహూర్తాలు కుదరగానే పెళ్లి

ఎక్కడికి వెళ్లినా నిన్ను అరియనా గురించి ఆడుతున్నారట కదా అని అడుగగా... అవును సర్, ఇంస్టాగ్రామ్ లో కూడా అరియనా గురించి అడుగుతున్నారు. ఆమె టాప్ ఫైవ్ లో ఉంది, త్వరలో వస్తుంది అని వాళ్లకు చెప్పను అన్నాడు.

avinash reveals his fame after bigg boss show ksr
Author
Hyderabad, First Published Dec 20, 2020, 6:56 PM IST
నేడు బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కావడంతో ఈ సీజన్లో పాల్గొన్న మిగతా 14మంది కంటెస్టెంట్స్ వేదికపైకి వచ్చారు. ఎలిమినేటై వెళ్ళిపోయిన కంటెస్టెంట్స్ అందరినీ నాగార్జున ఒక ప్రశ్న అడిగారు. బిగ్ బాస్ కి ముందు బిగ్ బాస్ తరువాత మీ లైఫ్ లో వచ్చిన మార్పు ఏమిటని అడిగారు. కంటెస్టెంట్స్ అందరూ తమ అనుభవాలు చెప్పగా... కమెడియన్ అవినాష్ కూడా చెప్పారు. ఒకప్పుడు తన కోసం తమ ఊరు వాళ్ళు మాత్రమే కలవడానికి వచ్చేవారు... కానీ ఇప్పుడు పక్క జిల్లాల వాళ్ళు కూడా వస్తున్నారు. 
 
ఎక్కడికి వెళ్లిన మా పేరెంట్స్ ని తన గురించి అడుగుతున్నారని అవినాష్ చెప్పాడు. ఒకప్పుడు ఊరు వెళితే ఆ ఊరు వాళ్లే తనను చూడడానికి వచ్చే వారట. కానీ ప్పుడు పక్కన ఉన్న జిల్లాల వాళ్లు కూడా వస్తున్నారని అవినాష్ అన్నాడు. తనతో పాటు తన పేరెంట్స్ తో కూడా ఫోటోలు దిగుతున్నారని అవినాష్ చెప్పడం విశేషం. తన తల్లి దండ్రులు నేను ఇచ్చిన బహుమతి ఇదే అని అవినాష్ గొప్పగా ఫీలయ్యాడు. 
 
ఇక ఎక్కడికి వెళ్లినా నిన్ను అరియనా గురించి ఆడుతున్నారట కదా అని అడుగగా... అవును సర్, ఇంస్టాగ్రామ్ లో కూడా అరియనా గురించి అడుగుతున్నారు. ఆమె టాప్ ఫైవ్ లో ఉంది, త్వరలో వస్తుంది అని వాళ్లకు చెప్పను అన్నాడు. ఇక పెళ్లిపై స్పందించిన అవినాష్..ఇప్పుడు ముహుర్తాలు లేవు... ముహుర్తాలు కుదరగానే పెళ్లి అని అవినాష్ చెప్పాడు. 
Follow Us:
Download App:
  • android
  • ios