`జబర్దస్త్`లో ఫేమస్‌ కమేడియన్‌లో అవినాష్‌ ఒకడు. తనదైన విలక్షణ కామెడీతో అలరిస్తున్నారు. సడెన్‌గా ఆయన బిగ్‌బాస్‌4లోకి ఎంటరయ్యాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అవినాష్‌ బిగ్‌బాస్‌హౌజ్‌లోకి వచ్చారు. అందరిని సర్‌ప్రైజ్‌ చేస్తూ ఆయన ఎంట్రీ సాగింది. అయితే రావడం రావడంతోనే జోకర్‌గా కామెడీని పండించాడు. అంతేకాదు బిగ్‌బాస్‌ హౌజ్‌ మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నాడు. తనదైన మ్యానరిజంతో అలరించాడు. 

బిగ్‌బాస్‌4లో పదకొండో రోజు ఆట మొత్తం అవినాష్‌ చుట్టూతే జరిగింది. ఆయనే ఎక్కువ భాగం ఇన్‌వాల్వ్ అయ్యారు. ఆటని తన భుజాలపై వేసుకుని నడిపించే ప్రయత్నం చేశారు. బెడ్‌కింద రాక్‌లో మార్చే ఎపిసోడ్‌లో అవినాష్‌ హిలేరియస్‌గా నవ్వించాడు. తనదైన హవభావాలతో ఆకట్టుకున్నాడు. గంగవ్వతో క్యాట్‌వాట్‌ చేసి అలరించారు. ఆయన ఎపిసోడ్‌ రేపు మరింత రసవత్తరంగా మారబోతుంది.

మిమిక్రీ ఆర్టిస్ట్‌ నుంచి జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అవినాష్‌ కరీంనగర్‌ జిల్లాలో రైతు కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పట్నుంచి ఎన్నో కష్టాలు పడ్డాడు. ఒంటరిగా తన జీవితంలో పోరాడాడు. గతంలో ఆయన ముంబయిలో అనిల్‌ కపూర్‌, అమితాబ్‌ బచ్చన్‌ వంటి వారి వద్ద డ్రైవర్‌గా పనిచేశాడు. 

హైదరాబాద్‌లో బీటెక్‌ చేసిన ఆయన ఓ లోకల్‌ టీవీలో మిమిక్రీ ఆర్టిస్ట్ గా పనిచేశాడు. అట్నుంచి జబర్దస్త్ లోకి ఎంటర్‌  అయ్యాడు. చిన్న కమెడీయన్‌గా అడుగుపెట్టి టీమ్‌ లీడర్‌గానూ మారాడు. ప్రస్తుతం `బిగ్‌బాస్‌` హౌజ్‌లోకి ఎంటరై తన ఇమేజ్‌ని మరింత పెంచుకోబోతున్నారు. అంతేకాదు ఇప్పుడు ఈ హౌజ్‌లో తనే హైలైట్‌గా నిలవబోతుండటం విశేషం. 

అయితే హౌజ్‌లోకి రావడానికి ముందు ప్రదర్శించిన ప్రోమో మాత్రం అందరిని భావ్వోద్వేగానికి గురి చేస్తుంది. జోకర్‌ జీవితంలోనూ అనేక కన్నీళ్ళు ఉంటాయంటారు. అలానే తన జీవితంలోనే కన్నీళ్ళున్నాయన్నారు. ఇంటర్మీడియట్‌ సమయంలోనే తాను ప్రేమలో విఫలమయ్యానని తెలిపాడు. ఈ ఎపిసోడ్‌ అందరిని కదిలించింది. మొత్తంగా రావడంతోనే మంచి మార్కులు కొట్టేశాడు అవినాష్‌. ఇక మున్ముందు హౌజ్‌లో ఎంతగా మెప్పిస్తాడో చూడాలి.