అవికా గోర్ తో గీతా మాధురి భర్త రొమాన్స్.. అగ్లీ స్టోరీ అంటున్నారు, ఫుల్ బోల్డ్ అన్నమాట..
అవికా గోర్ తాజాగా తన తదుపరి చిత్రాన్ని ప్రకటించింది. ఈ చిత్రానికి అగ్లీ స్టోరీ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

చిన్నారి పెళ్లికూతురు టీవీ సీరియల్ తో తెలుగువారిలో గుర్తింపు పొందింది అవికా గోర్. కాస్త వయసొచ్చాక హీరోయిన్ గా మారిపోయింది. ఉయ్యాలా జంపాల చిత్రంలో రాజ్ తరుణ్ తో కలసి చేసిన సందడి అంతా ఇంతా కాదు.
ఆ తర్వాత సినిమా చూపిస్తమావ , ఎక్కడికిపోతావు చిన్నవాడా లాంటి సూపర్ హిట్ చిత్రాలు అవికా గోర్ ఖాతాలో పడిపోయాయి. కానీ ఇటీవల అవికా గోర్ కి సరైన విజయం లేదు. ప్రస్తుతం అవికా కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. ఆ మూవీస్ పై అవికా చాలానే హోప్స్ పెట్టుకుని ఉంది.
అవికా గోర్ తాజాగా తన తదుపరి చిత్రాన్ని ప్రకటించింది. ఈ చిత్రానికి అగ్లీ స్టోరీ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రణవ స్వరూప్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా విడుదలైన టైటిల్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది.
వాడిపోయిన రోజా పువ్వుని పోస్టర్ లో హైలైట్ చేశారు. బోల్డ్ రొమాన్స్ తో కూడిన విషాద ప్రేమ గాధ అంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. అసలు ఈ చిత్రంలో అవికాతో జోడిగా నటిస్తున్న హీరో ఎవరో తెలుసా ? ప్రముఖ సింగర్ గీతా మాధురి భర్త, నటుడు నందు. తొలిసారి వీళ్ళిద్దరూ జంటగా నటిస్తున్నారు. బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.