చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో నేషనల్ వైడ్ గా గుర్తింపు అందుకున్న క్యూట్ పిల్ల అవికాగోర్. ఇక ఉయ్యాల జంపాల - సినిమా చూపిస్త మావ వంటి సినిమాలతో మంచిసక్సెస్ అందుకున్న అవికా గత కొంత కాలంగా సినిమాలు తగ్గిస్తూ వస్తోంది. ఇక  చాలా రోజుల దర్శనమిచ్చిన అవికా ఉహించని లుక్ లో దర్శనమిచ్చింది. 

అసలు ఆమె చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ లో కనిపించిన అమ్మాయేనా అని సందేహం కలుగక మానదు. రాజుగారి గది 3 సినిమాలో అవికా గోర్ ముఖ్య పాత్రలో కనిపించనుంది. మొదట ఈ సినిమా కోసం తమన్నాని అనుకున్నప్పటికీ ఆ తరువాత ఆమె డ్రాప్ అవ్వడంతో అవికా గోర్ ని తీసుకున్నారు. ఇక సినిమా ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు. 

ఫస్ట్ లుక్ లో హారర్ ఫీల్ ను కలిగించేలా అవికా గోర్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. మునుపెన్నడూ లేని విధంగా అవికా సినిమాలో సరికొత్తగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే సినిమా షూటింగ్ ఎండింగ్ కు వచ్చేసింది. వీలైనంత త్వరగా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసి అక్టోబర్ మొదటివారంలోనే రిలీజ్ చేయాలనీ ఓంకార్ ప్లాన్ చేసుకుంటున్నాడు.