హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో టాప్ ప్లేస్ ను దక్కించుకోవాలంటే అంత సాధారణమైన విషయం కాదు. సినిమా వరల్డ్ వైడ్ గా మంచి కలెక్షన్స్ ని రాబడితేనే ఇంటర్నేషనల్ బాక్స్ ఆఫీస్ రారాజుగా నిలవగలదు. గత పదేళ్లుగా టాప్ లో కొనసాగుతున్న అవతార్ కలెక్షన్స్ ని బ్రేక్ చేయడం ఎవరి వల్ల కాలేదు. 

మళ్ళీ అవతార్ 2నే ఆ రికార్డ్ ని బ్రేక్ చేస్తుందని అంతా భావించారు. కానీ ఊహించని విధంగా ఎవెంజర్స్: ఎండ్ గేమ్ ఆ దిశగా అడుగులు వేస్తోంది. 2009లో రిలీజైన అవతార్ ప్రపంచ వ్యాప్తంగా 2.788 బిలియన్ డాలర్స్ ను కలెక్ట్ చేసింది. అయితే ఏప్రిల్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎవెంజర్స్ ఇంకో 45 మిలియన్స్ డాలర్స్ ను అందుకుంటే అవతార్ రికార్డ్ ను బ్రేక్ చేస్తుంది. 

జూన్ 16 వరకు ఎవెంజర్స్: ఎండ్ గేమ్  $2.743 బిలియన్ల గ్రాస్ గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. మరికొన్ని రోజుల్లో అవతార్ కలెక్షన్స్ ని బీట్ చేసి హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పై అత్యధిక కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా జెండా ఎగురవేయనుంది. మరి ఈ చిన్న మొత్తాన్ని అందుకోవడానికి సినిమా ఎంత సమయాన్ని తీసుకుంటుందో చూడాలి.