విశాల్‌, ఆర్య హీరోలుగా బాల దర్శకత్వంలో  రూపొందిన చిత్రం 'వాడు- వీడు'. తమిళంలో రూపొందిన అవన్ ఇవన్ చిత్రం తెలుగులో డబ్బింగ్‌ అయ్యి ఇక్కడా విజయం సాధించింది.  ఆర్య, విశాల్ ఇద్దరి పాత్రలకు గానూ సర్వత్రా ప్రశంసలు లభించాయి. అయితే చిత్రం ఏమిటంటే.. ఈ చిత్రం రిలీజైన తొమ్మిది సంవత్సరాలకు కేసు వేసారు. ఈ సినిమాలో నటించిన ఆర్యకు, దర్శకుడు బాలాకు నోటీసులు పంపారు. వివరాల్లోకి వెళితే..

తమిళ స్టార్ హీరో  ఆర్యపై నెల్లై అంబసముద్రం కోర్టులో పరువు నష్టం దావా నమోదైంది. అయితే 9 ఏళ్ల క్రితం
నాటి చిత్రం గురించి ఇప్పుడు అతడిపై పరువు నష్టం దావా నమోదు కావడం గమనార్హం.   ఇద్దరు (తెలుగులో వాడు-వీడు) అనే చిత్రంలో  సింగంపట్టి జమీన్‌ పాత్రను ఆర్య కించపరిచాడని ఇప్పుడు పరువు నష్టం దావా నమోదైంది.

ఇక ఈ కేసుకి సంబంధించి సెప్టెంబర్ 28న ఆర్య, బాల తమ ముందు విచారణకు హాజరు అవ్వాలని కోర్టు
ఆదేశించింది. మరి ఈ కేసులో ఆర్య ఎలా ముందుకు వెళ్తారు..? అనేది చర్చనీయాంశంగా మారింది. దీనిపై మూవీ దర్శకుడు నిర్మాత, సినీ ఇండస్ట్రీ ..ఆర్యకు మద్దతును  ఇస్తారో.. లేదో..? చూడాలి. కాగా ఆర్య ప్రస్తుతం ‘టెడ్డి’ అనే చిత్రంలో నటిస్తున్నారు. దీంతో పాటు ‘3 దేవ్’ అనే  మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు.