Chandrabose : ఆస్కార్ విజేత చంద్రబోస్ కు ఆస్ట్రేలియా ప్రభుత్వం సత్కారం.. స్టార్ లిరిసిస్ట్ పై ప్రశంసలు..
తెలుగు సినీ గేయ రచయిత, ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ (Chandra Bose)పై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం వారు చంద్రబోస్ ను ఘనంగా సత్కరించారు.
తెలుగు చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖ లిరిసిస్ట్ చంద్రబోస్ ‘నాటు నాటు’ సాంగ్ కు ఆస్కార్ అందుకున్న విషయం తెలిసిందే. మార్చి 13న అమెరికాలోని డాల్బీ థియేటర్ లో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ 95వ వేడుక అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. ఒరిజినల్ స్కోర్ విభాగంలో Naatu Naatu నామినేట్ అయ్యి అవార్డు దక్కించుకుంది. ఆస్కార్ వేదికపై ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి (MM Keeravani), చంద్రబోస్ ఆస్కార్ అవార్డులన స్వీకరించిన విషయం తెలిసిందే.
ప్రతిష్టాత్మకమైన అవార్డు సొంతం చేసుకున్న ఎంఎం కీరవాణి, చంద్రబోస్ కు టాలీవుడ్ సినీ ప్రముఖులు సత్కరించిన విషయం తెలిసిందే. ప్రత్యేక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రశంసల వర్షం కురిపించారు. అలాగే పలు సాహితీ సంస్థలు కూడా చంద్రబోస్ ను సత్కరించాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా సన్మానించింది. దేశ వ్యాప్తంగా ప్రశంసలు కురిశాయి. ఆయా సంస్థలు సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూనే ఉన్నారు.
తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి చంద్రబోస్ కు గౌరవం దక్కింది. సెన్సేషనల్ సాంగ్ ‘నాటు నాటు’కు సాహిత్యం అందించి ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును గెలుచుకున్నందుకు ఈరోజు ఘనంగా సన్మానించారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో గల పార్లమెంట్ ఆఫ్ విక్టోరియా భవనంలో చంద్రబోస్ ను ‘రికగ్నైజేషన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు’ను అందజేశారు. మిస్టర్ లీ, మిస్టర్ మాట్ లు అవార్డును అందజేస్తూ ఆయన ప్రతిభకకు ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
5 వేలకు పైగా ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ కు చంద్రబోస్ తన సాహిత్యం అందిస్తున్నారు. ఇప్పటికీ ఆయన రచనలతో ఆకట్టుకుంటూనే ఉన్నాయి. ఇన్నాళ్ల ఆయన శ్రమకు ‘ఆస్కార్’ దక్కడంతో చంద్రబోస్, ఆయన అభిమానుల ఆనందానికి హద్దులేకుండా పోయింది. ప్రస్తుతం పుష్ప 2 : ది రూల్ తో పాటు ఆయా చిత్రాలకు సాహిత్యం అందిస్తున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ ప్రదర్శన జపాన్ లో కొనసాగుతోంది.