ఇండియన్ క్రికెటర్స్ లో చాలా మంది చేయగా ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ లో అయితే డేవిడ్ వార్నర్ చేసాడు. మరి అక్కడ నుంచి అది వారి ఆడియెన్స్ లోకి కూడా వెళ్ళిపోయింది.


పుష్ప(Pushpa)రిలీజ్ అయ్యి సంవత్సరం దాటినా ఇంకా క్రేజ్ తగ్గలేదు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ఇది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ నటన, లుక్ నెక్ట్స్ లెవల్ అనే చెప్పాలి. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ ఆయిన పుష్ప సినిమా అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలించి. బాలీవుడ్ లోనూ ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. 

ఆ సినిమాలో తాను చేసిన తగ్గేదేలే మ్యానరిజం అయితే ఇప్పటికీ ట్రెండ్. అనేకమంది స్టార్ క్రికెటర్స్ ఇదే మ్యానరిజం ని ఫాలో అయ్యారు. ఇండియన్ క్రికెటర్స్ లో చాలా మంది చేయగా ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ లో అయితే డేవిడ్ వార్నర్ చేసాడు. మరి అక్కడ నుంచి అది వారి ఆడియెన్స్ లోకి కూడా వెళ్ళిపోయింది. లేటెస్ట్ గా జరుగుతున్న సిరీస్ లో అయితే మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఆస్ట్రేలియన్ కుర్రాడు తగ్గేదేలే అంటూ చేసిన మ్యానరిజం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Scroll to load tweet…

ఇక ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ విలన్ గా నటించగా సునీల్ మరో నెగిటివ్ పాత్రలో నటించి మెప్పించారు. భారీ అంచనాల నడుమ వస్తోన్న పుష్ప 2 ప్రస్తుతం షూటింగ్‌ను జరపుకుంటోంది. ఎక్కడా తగ్గకుండా సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా చేస్తోంది. “పుష్ప ది రూల్” అనే పేరుతో వస్తున్న ఈచిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ను జరపుకుంటోంది

 అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8న ఈ సినిమా నుంచి గ్లింప్స్‌ను టీమ్ విడుదల చేయనుందని తెలుస్తోంది. దీనికోసం ప్రస్తుతం టీమ్ వర్క చేస్తోందని టాక్. అందులో భాగంగా సుకుమార్ ఈ గ్లింప్స్ కోసమే కొన్ని షాట్స్ చిత్రీకరిస్తున్నారట. మొన్నటి దాకా వైజాగ్‌లో జరిగిన ఈ సినిమా షూటింగ్ ఇటీవల హైదరాబాద్‌కు షిప్ట్ అయ్యినట్లు తెలుస్తోంది. ఇక ఈ షెడ్యూల్ తర్వాత బ్యాంకాక్‌లో భారీగా వేసిన సెట్స్‌లో అల్లు అర్జున్ జాయిన్ అవుతాడట. అక్కడే దాదాపు ఓ 30 రోజుల పాటు షూటింగ్ జరుగునుందని టాక్.. ఈ ముప్పై రోజుల్లో దాదాపు 40% షూటింగ్ కంప్లీట్ కానుందని.. బ్యాంకాక్‌లోని అక్కడి దట్టమైన అడవుల్లో ప్లాన్ చేశారట టీమ్ .