Asianet News TeluguAsianet News Telugu

#Kantara:ఓటిటిలోకి “కాంతారా”,షాకింగ్ ట్విస్ట్.! వరహా రూపం సాంగ్ మార్చేసారు

నవంబర్ 24 నుండి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల ఆడియన్స్ కి ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ ద్వారా అందుబాటులోకి  వచ్చింది. అయితే ఈ చిత్రం రావడంతోనే ఆడియన్స్ కు  షాకిచ్చింది.
 

Audience upset with the new version of #Varaharoopam song
Author
First Published Nov 24, 2022, 11:33 AM IST

రీసెంట్ గా  కన్నడలో తెరకెక్కి సూపర్ హిట్ కొట్టిన కాంతారా మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమా  కేవలం కన్నడంలో మాత్రమే కాకుండా  తెలుగు సహా పలు ఇతర భాష్లల్లో కూడా రిలీజ్ అయి అన్ని చోట్ల  పెద్ద సెన్సేషన్ సృష్టించింది. ఇప్పటికే రూ.400 కోట్ల కలెక్షన్ దక్కించుకున్న కాంతారా పై అనేకమంది ప్రేక్షకాభిమానుల తోపాటు పలువురు సినీ విశ్లేషకులు, విమర్శకులు సైతం ప్రసంశలు కురిపించారు.

 రిషబ్ శెట్టి స్వయంగా నటిస్తూ తెరకెక్కించిన ఈ డివైన్ బ్లాక్ బస్టర్ మూవీలో సప్తమి గౌడ హీరోయిన్ గా నటించగా హోంబలె ఫిలిమ్స్ వారు దీనిని ఎంతో గ్రాండ్ గా నిర్మించారు. అయితే ఈ ప్రతిష్టాత్మక సినిమా ఓటిటి రిలీజ్ కోసం అన్ని భాషల ఆడియన్స్ ఎప్పటినుండో ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. అనుకున్నట్లుగా  ఈ చిత్రం అర్ధరాత్రి నుండి అనగా డేట్ ప్రకారం నవంబర్ 24 నుండి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల ఆడియన్స్ కి ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ ద్వారా అందుబాటులోకి  వచ్చింది. అయితే ఈ చిత్రం రావడంతోనే ఆడియన్స్ కు  షాకిచ్చింది.

ఈ సినిమాకి కీలకమైన  వరహా రూపం సాంగ్ ని మార్చి ఇందులో పెట్టడం ఒకొక్కరికి షాకింగ్ గా మారింది.   తెలుగు వెర్షన్ లో సహా  అన్ని వెర్షన్స్ లో కూడా భారీగా “వరాహ రూపం” క్లిక్ అయ్యింది. కానీ ఈ సాంగ్ థియేటర్స్ లో చూసిన దానికి తర్వాత మేకర్స్ రిలీజ్ చేసిన దానికి ఇప్పుడు ప్రైమ్ లో ఉన్న దానికి చాలా తేడా వినిపించింది.

ఇప్పుడు ఓటిటిలో మ్యూజిక్ మారిపోయింది. గొంతు పూర్తిగా మార్చేసారు. టోటల్ గా అయితే ఇంతకు ముందు ఈ సాంగ్ విని మైమరచిపోయిన ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా డిజప్పాయింట్ అయ్యి..షాక్ అయ్యారు. ఈ క్రమంలో ఇంత గొప్ప సాంగ్ ని ఎందుకు ఇలా మార్చేసారో అనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపధ్యంలో  థియేటర్స్ లో అదరగొట్టిన కాంతారా, ఓటిటి లో ఆడియన్స్ నుండి ఎంత మేర క్రేజ్ అందుకుంటుందో చూడాల్సి ఉంది.

ఈ ట్యూన్ ని ముందే వేరే వాళ్ళు ఐదేళ్ల కితమే కంపోజ్ చెయ్యగా దాన్ని ఈ సినిమా సంగీత దర్శకుడు కాపీ కొట్టడంతో కాపీ రైట్ పడింది. దీనితో ఈ సాంగ్ తొలగించినట్టుగా తెలుస్తుంది.  ఏదైమైనా  ఈ ఊహించని ట్విస్ట్ వైరల్ గా మారింది. మరోప్రక్క ఓటిటి లో  హిందీ వర్షన్ గురించి మాత్రం అప్ డేట్ రావలసి ఉంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios