శ్రీకాకుళం: జబర్దస్త్ టీవీ షో ఫేమ్‌ నరేష్ డ్యాన్స్ టీమ్‌పై దాడి జరిగింది. శ్రీకాకుళం చిన్నబరాటం వీధికి చెందిన యువకులు దాడి చేశారు. యువకులు గ్రీన్ రూమ్‌లోకి తొంగి చూశారు. దాన్ని బౌన్సర్‌లు అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. 

దీంతో నరేష్ బృందం తిరుగుప్రయాణం అయిన తర్వాత మార్గమధ్యలో కొందరు స్థానిక యువకులు వాహనాలపై దాడికి పాల్పడ్డారు. ఒక యువకుడిని పట్టుకొని టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. 

కళింగాంధ్ర ఉత్సవాల్లో ప్రోగ్రాం ముగించుకొని వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దాడికి కారణమైన వాళ్లని అరెస్ట్ చేయాలని జిల్లా కలెక్టర్ పోలీసులను అదేశించారు.