Asianet News TeluguAsianet News Telugu

భార్యతో కలిసి బిగ్ బాస్ 7 లోకి రాబోతున్న స్టార్ కొరియోగ్రఫర్, వైరల్ న్యూస్ లో నిజమెంత..?

బిగ్ బాస్ హడావిడి స్టార్ట్ అయ్యింది. ఇప్పటికే రెండు ప్రోమోలు కూడా రిలీజ్ అయ్యాయి. అంతే కాదు.. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళేది వీళ్లే అంటూ.. కొంత మంది నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈక్రమంలో రోజుకో పేరు వినిపరిస్తుండగా..తాజాగా బిగ్ బాస్ లోకి వెళ్లడానికి రెడీగా ఉన్నారంటూ.. టాలీవుడ్ స్టార్ కొరియోగ్రఫర్ జంట రెడీగా ఉన్నారు. 

Ata Sandeep and His Wife Jyothi Select Bigg Boss Telugu Season 7 JMS
Author
First Published Jul 21, 2023, 12:50 PM IST

టాలీవుడ్ లో బిగ్ బాస్ హడావిడి స్టార్ట్  అయ్యింది. ఈసారి కూడా కింగ్ నాగర్జున హోస్టింగ్ చేయబోతున్నాడు. ఇప్పటికే రెండు ప్రోమోలు సందడి చేస్తున్నాయి. అయితే ఈ షో ఎప్పుడు స్టార్ట్ కాబోతోంది మాత్రం ఇంకా ప్రకటించలేదు. గత సీజన్లను దృష్టిలో పెట్టుకుని.. అంతకు మించి అన్నట్టుగా షోను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.. ఈక్రమంలో బిగ్ బాస్ లోకి వెళ్లేవాళ్లు వీళ్లే అంటూ.. చాలా మందిపేర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.  

బిగ్ బాస్ సీజన్ – 7 లో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. అందులో భరత్, ఉదయభాను, ఢీ ఫేం పండు, సురేఖ, అమర్ దీప్, తేజస్విని జంట,  మోహన భోగరాజు, హేమచంద్ర, శ్రావణ భార్గవి, విష్ణు ప్రియ లాంటి బుల్లితెర సెలబ్రిటీల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అంతే కాదు ఈమధ్యే బుల్లితెర మెగాస్టార్ అనిపనించుకున్న ప్రభాకర్ కూడా హౌస్ లోకి రాబోతున్నాడంటూ.. వార్త హల్ చల్ అవుతుంది. ప్రభాకర్ హౌస్ లోకి రాకుంటే.. అతని కొడుకు..రీసెంట్ గా హీరోగా ఎంట్రీ ఇచ్చిన యాటీట్యూడ్ స్టార్ చంద్రహాస్ అయినా హౌస్ లోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

 

ఇక తజాగా మరో స్టార్ కపుల్ పుర్లు బిగ్ బాస్ లికస్ట్ లో కనిపించినట్టు తెలుస్తోంది. ప్రముఖ డాన్స్ మాస్టర్, కొరియోగ్రఫర్  ఆట సందీప్ ఆయన భార్య జ్యోతి  కూడా ఈ సీజన్ లో కనిపించే అవకాశాలు ఉన్నాయని న్యూస్ వైరల్ అవుతోంది.  ఆట ప్రొగ్రామ్ ద్వారా మంచి పేరు తో పాటు ఇమేజ్ కూడా సంపాదించుకున్నాడు సందీప్ .  సందీప్‌‌కి సోషల్ మీడియాలో చాలా క్రేజ్ ఉంది. ఎప్పడికప్పుడు రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌‌గా ఉంటాడు. సినిమా ఈవెంట్లు, కవర్ సాంగ్స్ చేస్తూ తనదైన మార్క్ డాన్స్‌‌లతో జనాలను అలరిస్తుంటాడు. 

అంతే కాదు సోషల్ మీడియాలో డాన్స్ తో సందడి చేసే ఇద్దరు కపుల్ కు.. మంచి ఫాలోయింగ్ ఉంది. అంతే కాదు సందీప్ హీరోగా ఓ సినిమా కూడా చేస్తున్నాడు.  సందీప్ జోడి బిఅంగ్ బాస్‌‌‌లోకి వస్తే మరింత హైప్ వస్తుందని బిగ్ బాస్ యాజమాన్యం అనుకుంటున్నరట. మరి అసలు ప్రోమో వచ్చేదాకా వేచి చూడక తప్పదు.

Follow Us:
Download App:
  • android
  • ios