Asianet News TeluguAsianet News Telugu

శేఖర్ కమ్ముల రియల్ క్యారెక్టర్ ఏంటంటే..?

గతేడాది కాస్టింగ్ కౌచ్ కి సంబంధించి నటి శ్రీరెడ్డి చాలా మంది దర్శకనిర్మాతలపై ఆరోపణలు చేసింది. 

associate director chaitanya comments on sekhar kammula
Author
Hyderabad, First Published May 3, 2019, 2:27 PM IST

గతేడాది కాస్టింగ్ కౌచ్ కి సంబంధించి నటి శ్రీరెడ్డి చాలా మంది దర్శకనిర్మాతలపై ఆరోపణలు చేసింది. ఈ లిస్ట్ లో దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా ఉన్నాడు. దీంతో దర్శకుడు శేఖర్ కమ్ముల.. శ్రీరెడ్డి ఆరోపణలకు సంబంధించి సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చారు. తనకు శ్రీరెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇది ఇలా ఉండగా.. శేఖర్ కమ్ముల రియల్ క్యారెక్టర్ గురించి అతడి దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసే చైతన్య అనే మహిళ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. 2006లో వచ్చిన 'గోదావరి' సినిమా నుండి శేఖర్ కమ్ముల వద్ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నానని.. ఇప్పటివరకు ఆయన చేసిన తొమ్మిది చిత్రాల్లో ప్రతి సినిమాకి ఇరవై మంది మహిళా క్రూ మెంబర్స్ ఉన్నారని తెలిపారు.

సినిమాకు సంబంధించి కాస్టింగ్ కి పనులు తామే చూసుకుంటామని అందులో ఆడవాళ్లు కూడా ఉంటారని క్లారిటీ ఇచ్చింది. శేఖర్ కమ్ముల మొదటి సినిమా డాలర్ డ్రీమ్స్ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సునీత తాటి అనే మహిళ పని చేశారని గుర్తు చేసుకున్నారు. శేఖర్ కమ్ములను ఏమైనా అంటే అది మమ్మల్ని అన్నట్లేనని కాస్టింగ్ కౌచ్ లో మేము కూడా  భాగమే అంటూ చెప్పుకొచ్చింది.

శేఖర్ కమ్ముల చిత్రాల్లో కాస్టింగ్ కౌచ్ ఉండదని, ఆయన మహిళలకు ఎంతో గౌరవం ఇస్తారని తెలిపింది. సినిమాల్లో కూడా ఆయన మహిళలను డీగ్రేడ్ చేసి చూపించరని, అలాంటి వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు ఎలా వచ్చాయో తెలియదని అన్నారు. శ్రీరెడ్డి తను చేసిన ఆరోపణలు తప్పు అని తరువాత రియలైజ్ అయ్యారని స్పష్టం చేసింది చైతన్య. 

Follow Us:
Download App:
  • android
  • ios