మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ... లక్ష గెలుచుకున్న లక్కీ ఫ్యాన్స్ వీరే!
ఖుషి చిత్ర సక్సెస్ మీట్లో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వంద మందికి లక్ష రూపాయల చొప్పున ఒక కోటి రూపాయలు తన రెమ్యునరేషన్ నుండి పంచనున్నట్లు వెల్లడించారు. మాట నిలబెట్టుకుంటూ వంద మందిని ఎంపిక చేసి లక్ష రూపాయలు అందిస్తున్నారు.

విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నేడు ఆ లక్ష రూపాయలు గెలుచుకున్న లక్కీ ఫ్యాన్స్ లిస్ట్ విడుదల చేశారు. ఆయన స్వయంగా తన అధికారిక ఖాతాలో పోస్ట్ చేశారు. తన కాంట్రిబ్యూషన్ ఆ వంద మంది కుటుంబాల్లో ఆనందం నింపిందని భావిస్తున్నానని ఆయన కామెంట్ చేశారు. లక్ష రూపాయలకు ఎంపిక కాబడిన ఆ లక్కీ ఫ్యాన్స్ కి చెక్కుల రూపంలో డబ్బులు పంపిణీ చేయనున్నారని సమాచారం.
గతంలో కూడా విజయ్ దేవరకొండ ఓ వంద మంది అభిమానులను సొంత ఖర్చులతో నార్త్ ఇండియా టూర్ కి పంపాడు. దీని కోసం ఆయన లక్షల్లో ఖర్చు చేశారు టాలీవుడ్ లో మరొక హీరో అభిమానులకు ఈ విధంగా డబ్బులు ఖర్చు చేసిన దాఖలాలు లేవు. కోవిడ్ సమయంలో కూడా విజయ్ దేవరకొండ సామాజిక బాధ్యత నెరవేర్చాడు. ఒక టీమ్ ని ఏర్పాటు చేసి పేదలకు కిరాణా, కూరగాయలు వంటి నిత్యావసరాలు అందించారు.
ఖుషి చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. విజయ్ దేవరకొండకు జంటగా సమంత(Samantha) నటించింది. సెప్టెంబర్ 1న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. సిల్వర్ స్క్రీన్ పై సమంత-విజయ్ దేవరకొండ కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయ్యింది. తమిళనాడు ఓవర్సీస్ లో ఖుషి మంచి వసూళ్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కాలేదు.