తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత ఆధారంగా వివిధ కోణాల్లో కథలు తెరకెక్కుతున్నాయి. ఒక వెబ్ సిరీస్ అలాగే మరో మూడు సినిమాలు సెట్స్ పైకి వచ్చాయి. అందులో బాలీవుడ్ కాంట్రవర్సీ బ్యూటీ కంగనా రనౌత్ సినిమా కూడా ఉంది. కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు విజయ్ దర్శకత్వంలో దాదాపు 100కోట్ల బడ్జెట్ తో జయ బయోపిక్ ని ప్లాన్ చేస్తున్నారు. 

ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటున్న దర్శకుడు కంగనా స్టార్ హోదాకు తగ్గట్టుగా ఉండాలని పెద్ద పెద్ద స్టార్స్ ని సినిమాలో సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇక తమిళనాడు ఎవర్ గ్రీన్ కథానాయకుడు మాజీ ముఖ్యమంత్రి ఎమ్ జిఆర్ పాత్ర కోసం అరవింద్ స్వామిని సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. జయలలిత రాజకీయ రంగంలో ఎదగడానికి ఎమ్ జి ఆర్ పాత్ర ఎంతో ఉంది. 

అందుకే ఆ పాత్ర కోసం అరవింద్ స్వామికి బారి రెమ్యునరేషన్ ఇచ్చి సెలెక్ట్ చేసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ మరికొన్ని వారాల్లో మొదలుకానుంది. ఇప్పటికే బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేశారు. ఇక పూర్తి నటీనటులను సెలెక్ట్ చేసుకొని సినిమా షూటింగ్ ని వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలనీ చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది.