ప్రభాస్ 'జోకర్' కామెంట్స్ , మాట మార్చిన అర్షద్ వార్సి,నేను అలా అనలేదే

నాకు కల్కిలో ప్రభాస్‌ను చూస్తున్నప్పుడు  బాధగా అనిపించింది. అమితాబ్‌ ముందు ప్రభాస్‌ ఒక జోకర్‌లా కనిపించాడు. ప్రభాస్ ఎందుకు ఇలాంటి చేస్తాడు

Arshad Warsi says his comments on Kalki misconstrued: Prabhas is great jsp

ప్రభాస్ హీరోగా   దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కి సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం “కల్కి 2898 ఎడి”. ప్రభాస్ కెరీర్ లో ఇదొక భారీ వసూళ్ల చిత్రంగా నిలిచిపోయింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు అమితాబ్‌ నటనపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉంటే  బాలీవుడు నటుడు అర్షద్ వార్సి   ‘కల్కి 2898 AD’లో ప్రభాస్ నటనపై చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర దుమారం రేకెత్తించాయి. కల్కి చిత్రంలో ప్రభాస్‌ జోకర్‌లా కనిపించారంటూ చేసిన వ్యాఖ్యలపై ప్రభాస్‌ ఫ్యాన్స్ తీవ్రంగా స్పందించారు. కేవలం అభిమానులు మాత్రమే కాకుండా హీరోలు, నాని, సుధీర్ బాబు, డైరక్టర్ అజయ్ భూపతి వంటివారు కూడా ఖండించారు. 

ప్రభాస్ కల్కి సినిమా నచ్చలేదు


 
ఇక నటుడుగా అర్షద్‌ వార్సి గురించి  స్పెషల్ గా  చెప్పాల్సిన అవసరం లేదు. మున్నాభాయ్ సిరీస్, జాలీ ఎల్‌ఎల్‌బీ, గోల్‌మాల్ ఫ్రాంచైజీ వంటి చిత్రాలలో తన  నటనతో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నారు.   అర్షద్ వార్సిని యూట్యూబ‌ర్ సందీష్ భాటియా ఇంట‌ర్వ్యూ చేశాడు. ఈ ఇంటర్వ్యూలో కల్కి మూవీపై తన అభిప్రాయాన్ని తెలియజేశాడు అర్షద్ వార్సి. అర్షద్‌ మాట్లాడుతూ.. “క‌ల్కి’ సినిమా త‌న‌కు న‌చ్చలేద‌ని చెప్పాడు. బిగ్ బి అమితాబ్ బ‌చ్చన్ అస‌లే అర్థం కాడు. ఈ వ‌య‌సులో క‌ల్కి లాంటి సినిమాలు ఎలా చేస్తున్నాడు. ఆయ‌న‌కు ఉన్న పవ‌ర్‌లో నాకు కొంచెం ఉన్న లైఫ్ సెట్ అయిపోతుంది. అతడు అసాధారణమైన వ్యక్తి. నాకు కల్కిలో ప్రభాస్‌ను చూస్తు్న్నప్పుడు బాధగా అనిపించింది. అమితాబ్‌ ముందు ప్రభాస్‌ ఒక జోకర్‌లా కనిపించాడు. ప్రభాస్ ఎందుకు ఇలాంటి చేస్తాడు” అంటూ అర్షద్ చెప్పుకొచ్చాడు. 

Arshad Warsi says his comments on Kalki misconstrued: Prabhas is great jsp

 

ప్రభాస్ లుక్ జోకర్ లా కనిపించింది

కల్కి చిత్రంలో ప్రభాస్ లుక్ జోకర్ లా అనిపించిందని, మెల్ గిబ్సన్ లా గంభీరంగా కనిపించాల్సిన ప్రభాస్ అందుకు భిన్నంగా కనిపించేసరికి తనకు చాలా బాధగా అనిపించిందని పేర్కొన్నాడు. ప్రభాస్ ను మ్యాడ్ మ్యాక్స్ సినిమా తరహాలో చూడాలనుకుంటున్నానని, కానీ కల్కి చిత్రంలో ఆయన వేషధారణ ఎందుకు అలా ఉందో అర్థం కావడంలేదని అర్షద్ వార్సీ పేర్కొన్నాడు. ప్రభాస్... నా అభిప్రాయం చెప్పడానికి చాలా బాధపడుతున్నాను అంటూ ఆ  ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇవన్నీ వైరల్ అయ్యాయి.

 

దిల్ రాజు సైతం ప్రభాస్ కామెంట్ కు కౌంటర్

హీరో నాని అర్షద్‌కు స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చేశాడు. తన కెరీర్ మొత్తంలో సంపాదించుకోలేనంత పబ్లిసిటీ ప్రభాస్‌ మీద కామెంట్ చేసి అర్షద్ సంపాదించుకున్నాడు అంటూ సర్కాస్టిక్‌గా చురకలు అంటించాడు. నాని కంటే ముందే సుధీర్ బాబు, సిద్దు కూడా స్ట్రాంగ్‌గానే రియాక్ట్ అయ్యారు. ఇక ప్రొడ్యూసర్ దిల్‌రాజు కూడా గట్టిగా రెస్పాండ్ అయ్యారు. జోకర్ అన్నంత మాత్రాన జోకర్ అయిపోతారా..ప్రభాస్‌ని అంటేనే కదా పబ్లిసిటీ వస్తుంది..అందుకే అంటారని కౌంటరిచ్చారు.

 

ప్రభాస్ పై వ్యాఖ్యలపై నాగ్ అశ్విన్ స్పందన

 నాగ్‌ అశ్విన్‌ స్పందించారు.  ‘నార్త్‌-సౌత్‌, టాలీవుడ్‌ వెర్సస్‌ బాలీవుడ్‌.. ఇలా పోలుస్తూ వెనక్కి వెళ్లొద్దు. మనమందరం ఒక ఇండస్ట్రీకి చెందినవాళ్లమే. అర్షద్‌ కొంచెం హుందాగా మాట్లాడాల్సింది. అయినా ఫర్వాలేదు. మేము అతడి పిల్లల కోసం ‘కల్కి’ బుజ్జి బొమ్మలు పంపిస్తాం.  కల్కి రెండోభాగం కోసం మరింత కష్టపడి పనిచేస్తాను. అందులో ప్రభాస్‌ను (Prabhas) బెస్ట్‌గా చూపిస్తాను’’ అని రాసుకొచ్చారు.  ప్రపంచంలో చాలామంది మనల్ని ద్వేషిస్తారు. కానీ, మనం వాటిని పట్టించుకోకుండా ముందుకెళ్లాలి అని నాగ్‌అశ్విన్‌ చెప్పారు. ప్రభాస్‌ కూడా ఇదే మాట అంటుంటారని ఆయన తెలిపారు. 

 

ప్రభాస్ ఫ్యాన్స్ కు భయపడి కామెంట్స్ డిసేబుల్

ప్రభాస్ ని జోకర్ అనటంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ మామూలుగా లేదు. నెటిజన్ల దెబ్బకు అర్షద్ వార్సీ ఇన్ స్టాగ్రామ్ లో తన ఫ్యామిలీ ఫొటో పోస్టుకు కామెంట్స్ ఆఫ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇన్ స్టాగ్రామ్ లో తన కుటుంబ ఫోటో పోస్టు చేసిన అర్షద్ వార్సీ... ఆ పోస్టుపై ఎవరూ కామెంట్ చేయకుండా, కామెంట్స్ డిసేబుల్ చేశాడు. అయినా ఫ్యాన్స్ ఆగలేదు. ప్రభాస్ బూటు అంత విలువ చేయదు నీ జీవితం అని ఒకరు... నీ ఆస్తి కంటే ప్రభాస్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు 10 రెట్లు ఎక్కువ అని ఇంకొకరు... నువ్వు పెట్టుకోకూడని వాళ్లతో పెట్టుకున్నావు అంటూ మరొకరు... ఇండస్ట్రీ మొత్తమ్మీద నీకంటే పెద్ద జోకర్ ఎవరైనా ఉన్నారా?... వెంటనే ప్రభాస్ కు సారీ చెప్పు అంటూ మరొకరు... ఇలా అర్షద్ వార్సీని ఉక్కిరిబిక్కిరి చేసేసారు.

Arshad Warsi says his comments on Kalki misconstrued: Prabhas is great jsp

 

ప్రభాస్ ని నేను జోకర్ అని పిలవలేదు


 ఈ వివాదానికి అర్షద్ వార్సీ ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు. తాను ప్రభాస్‌ను 'జోకర్' అని పిలవలేదని చెప్పాడు. ఏఎన్ఐ వార్తా సంస్థలో వచ్చిన కథనం ప్రకారం... అర్షద్ వార్సీ మాట్లాడుతూ, 'ప్రతి ఒక్కరికీ కొన్ని అంశాలపై వారిదైన అభిప్రాయం  ఉంటుంది. ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి ఇష్టపడతారు. కల్కి సినిమాకు సంబంధించి నేను వ్యక్తి గురించి కాకుండా అతను పోషించిన పాత్ర గురించి మాట్లాడాను. అతను (ప్రభాస్) బ్రిలియెంట్ యాక్టర్. తనను తాను ఎన్నో సార్లు నిరూపించుకున్నాడు. దాని గురించి మనందరికీ తెలుసు. అలాంటి మంచి నటుడికి చెడ్డ క్యారెక్టర్ ఇస్తే ప్రేక్షకుల గుండె పగిలిపోతుంది.' అన్నాడు.

బిగ్ బాస్ తెలుగు 8 లైవ్ అప్డేట్స్, పోల్స్ ఇక్కడ చూడండి
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios