మంచి ఫామ్ లో ఉన్న సమయంలో కిర్రాక్ పార్టీ సినిమాతో ఊహించని అపజయాన్ని అందుకున్న హీరో నిఖిల్ నెక్స్ట్ ఎలాగైనా హిట్టందుకోవాలని ఒక డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడు. సప్సెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన అర్జున్ సురవరం సినిమా టీజర్ ని ఫైనల్ గా నిఖిల్ రిలీజ్ చేశాడు. 

తమిళ్ సినిమా కనితన్ కు రీమేక్ గా వస్తోన్న ఈ సినిమాపై నిఖిల్ అంచనాలు భారీగా పెట్టుకున్నాడు. టీజర్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంది. జర్నలిజం నేపథ్యంలో సినిమా తెరకెక్కింది. ఇకపోతే సినిమాలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. 

లావణ్యకి కూడా గత కొంత కాలంగా హిట్ లేదు. ఈ సినిమా హిట్టవ్వడం ఆమెకు చాలా అవసరం. టి.సంతోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చ్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.