గత కొన్నాళ్లుగా వరుస అపజయాలతో సతమతమవుతున్న యువ హీరో నిఖిల్ సిద్దార్థ్ ఎలాగైనా మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే రిలీజ్ కాకుండానే మిగిలిపోతుంది అనుకున్న అర్జున్ సురవరం సినిమాను మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తేవడానికి ఈ యువ హీరో ప్రయత్నాలు చేస్తున్నాడు.

గత కొంత కాలంగా ఈ సినిమా రిలీజ్ తేదీ వాయిదా పడుతోంది. 0గతంలో ఎప్పుడు లేని విధంగా నిఖిల్ తన సినిమా పూర్తి చేసినప్పటికీ అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేకపోయాడు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల సినిమా ప్రీ ప్రొడక్షన్ తరువాత అలాగే ఉండిపోయింది. ఇక ఫైనల్ గా సినిమా రిలీజ్ కావడానికి సిద్దమవుతున్నట్లు నిఖిల్ అధికారికంగా తెలియజేశాడు.

తమిళ్ కనితన్ కు ఈ సినిమా రీమేక్.  మొదటి నుంచి ఈ సినిమాకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.  కిర్రాక్ పార్టీ దారుణంగా ప్లాప్ అవ్వడంతపో ఈ రీమేక్ తో అయినా హిట్టందుకోవాలని కష్టపడుతుంటే మొదట ముద్ర అని టైటిల్ ఫిక్స్ చేసుకోగా అది కాస్త క్యాన్సిల్ అయ్యింది. అప్పట్లో మే 1న అర్జున్ సురవరం రిలీజ్ కానున్నట్లు ప్రమోషన్స్ డోస్ పెంచిన నిఖిల్ మళ్ళీ కనిపించలేదు.  ఇక  ఇప్పుడు ఎంతవరకు హిట్ అందుకుంటాడో చూడాలి. టిసంతోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లావణ్య త్రిపాఠీ హీరోయిన్ గా నటించింది. ఈ బ్యూటీకి కూడా గత కొంత కాలంగా హిట్స్ లేవు.సో.. లావణ్య కెరీర్ కు కూడా అర్జున్ సురవరం చాలా ఇంపార్టెంట్.