‘అర్జున్ రెడ్డి’ సినిమా వల్ల నరకయాతన అనుభవించా.!

arjun reddy movie heroine shalini panday personal problems
Highlights

 ‘అర్జున్ రెడ్డి’ సినిమా వల్ల నరకయాతన అనుభవించా.!

తనకెంతో పేరు తెచ్చిపెట్టిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా వల్ల ఒకవిధంగా తనెంతో నరకయాతన అనుభవించానని ఈ మూవీ హీరోయిన్ షాలినీ పాండే తెలిపింది. ఈ చిత్రం షూటింగ్ సమయంలో నేను పడిన యాతన చెప్పలేను. గతంలో నేను కాలేజీలో చదువుతున్నప్పుడు రెండు సార్లు ప్రేమలో పడి విఫలమయ్యా.

ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా… లవ్‌లో ఫెయిల్ అయిన నేను హీరోతో రొమాంటిక్ సీన్స్‌లో నటించాల్సి వచ్చింది. అప్పటి నా పరిస్థితి వర్ణనాతీతం..అని శాలిని ఓ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాపోయింది. అంత బాధలో ఉన్నా సకాలంలో షూటింగ్ పూర్తి చేయగలిగానని పేర్కొంది. సినిమాల్లో ఛాన్సుల కోసం తలిదండ్రులతో గొడవ పడి ఇంటి నుంచి బయటకు వచ్చేశానని, ముంబైలో తను పడిన అద్దె ఇంటి కష్టాలు ఇప్పటికీ మరిచిపోలేనని ఆమె వెల్లడించింది. ఇలా తన వ్యక్తిగత సమస్యలు, తను పడిన బాధలను షాలిని వివరించింది.

loader