మహేష్ బాబుతో అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ మూవీ అర్జున్ రెడ్డి చూసి మహేష్ బాబు అభినందించడంతో ఎక్జైట్ అయ్యానన్న సందీప్ మంచి కథ సిద్ధం చేసి మహేష్ బాబుతో సినిమా చేస్తానంటున్న సందీప్
అర్జున్ రెడ్డి చిత్రంతో తెలుగు సినిమాల్లో ఒక కొత్త ఒరవడికి నాంది పలికిన దర్శకుడు సందీప్ రెడ్డి. అర్జున్ రెడ్డి చిత్రాన్ని ఓ అద్భుతమైన చిత్రంగా.. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన శివ లాంటి ఒక ట్రెండ్ సెట్టర్ గా తెలుగు సినిమా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ముప్పై కోట్ల వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం యాభై కోట్ల వరకూ రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు అంటున్నారు.
తాజాగా డైరెక్టర్ సందీప్ రెడ్డి మాట్లాడుతూ ఈ సినిమా హిట్ అవుతుంది అనుకున్నాం కానీ ఈ రేంజిలో హిట్ అవుతుందని ఊహించలేదన్నారు. ఈ సినిమా చూసిన తరవాత చాలా మంది తనకి మెసేజ్ ల మీద మెసేజ్ లు పెట్టారు అనీ ఇండస్ట్రీ పెద్దలు చాలామంది తనకి కాల్ చేసారనీ సందీప్ చెప్పుకొచ్చాడు.
ఈ సినిమా చూసిన తరవాత మహేష్ బాబు కాల్ చేసి మెచ్చుకుంటూ ఉంటె తను చాలా ఎక్జైట్ అయ్యానన్నాడు సందీప్. వీలు చూసుకుని ఒక సినిమా చేద్దామని మహేశ్ బాబు అనడం తనని సంతోషంతో ఉక్కిరి బిక్కిరి చేసిందని చెప్పాడు. మహేశ్ బాబుతో సినిమా చేయాలనే కోరిక తనకి ఎప్పటి నుంచో ఉందనీ, ఆ సమయం కోసం చూస్తున్నా అన్నాడు. మంచి కథలో మహేష్ ను ఒప్పిస్తాననంటున్నాడు.
